రుద్రజటా, జటావల్లి అనే పేర్లు కూడాకలిగిన రుద్రజాడ ఆయుర్వేదపరంగా ఎన్నో ఉపయోగాలు కలిగి ఉంది.
మూత్రదోషాల నివారణకు
రుద్రజాడ వేరు కషాయం సేవించినట్లయితే మూత్రకోశ వ్యాధులు తగ్గుతాయి. ఇదే కషాయం తాగితే మూత్ర విసర్జన సాఫీగా ఉంటుంది.
జీర్ణవ్యవస్థ కోసం
రుద్రజాడ మొక్క చాలామందికి తెలియకపోవచ్చు గానీ, సబ్జా గింజలు అందరికీ సుపరిచితమే. ఈ గింజలు రుద్రజాడ చెట్టు నుంచే లభిస్తాయి. గింజలు నీళ్ళలో నానబెడితే అవి ఉబ్బి తెల్లగా మారతాయి.
ఈ గింజలతో పాటునీటిని సేవిస్తే శరీరంలోని వేడిమి నశించడంతోపాటు, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
వెయిట్ లాస్ కోసం
బరువు తగ్గాలని తపించేవారికి సబ్జా గింజలు దివ్య ఔషధం వంటివి. నీళ్ళలో నానబెట్టిన గింజలు రోజూ సేవిస్తే ఒంట్లో కొవ్వు కరగడంతోపాటు బరువు తగ్గుతారు.
సబ్జాగింజలు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతాయి
ఈ గింజలను నీళ్ళలో, చెరుకురసంలో, మజ్జిగలో, నిమ్మరసంలో, రకరకాల జ్యూస్ లలో కలుపుకుని కూడా సేవించవచ్చు.