నల్ల ఉమ్మెత్త కాడలు, కొమ్మలు, ఆకులు, కాండము, పువ్వులు, కాయలు కూడా ఊదారంగుగా ఇంచుమించు నలుపుగా ఉంటాయి. సంస్కృతంలో నల్ల ఉమ్మెత్తను కృష్ణధుత్తూరము, కృష్ణ పుష్పము, విషారాతి, క్రూర ధూర్తము అనే పేర్లుతో పిలుస్తారు. కారపు రుచి, కృష్ణ వీర్యము కలిగినది. కాంతి కలిగిస్తుంది. వ్రణ బాధలు(కురుపులు) తగ్గిస్తుంది. చర్మదోషములు, దురదలు, జ్వరములు హరిస్తుంది.
నల్ల ఉమ్మెత్త ఆకుల రసము, నువ్వుల నూనె కలిపి లేపనం చేస్తూ ఉంటే గజ్జి, తామర వంటి భయంకర చర్మవ్యాధులు క్రమేపీ తగ్గుముఖం పడతాయి.
ఉమ్మెత్త ఆకులపై నువ్వుల నూనె రాసి వెచ్చచేసి అధిక కొవ్వు ఉన్న చోట కట్టుకడితే కొవ్వు కరుగుతుంది.
నల్ల ఉమ్మెత్త తెల్ల ఉమ్మెత్త కంటే త్వరితముగాను, ఎక్కువగాను గుణము నిస్తుంది.