శణపుష్ప, ఘంటారవ అనే పేర్లు కూడా కలిగిన గిలిగిచ్చ మొక్కలు వరిపొలముల గట్లపై, వరి మళ్ళలోను విస్తారముగా పెరుగుతాయి. కాయలు జనుము కాయల వలె ఉంటాయి. తెల్లని రంగులో ఉంటాయి. పచ్చపువ్వుల జాతి కూడా దీనిలో ఉంటుంది. ఈ మొక్క రెండడుగుల ఎత్తు పెరుగుతుంది. శీతాకాలములో కాయలు విస్తారముగా దొరుకుతాయి. కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి.
గిలిగిచ్చ గుణములు
ఇవి చేదు, కారము రుచిగా ఉంటాయి. వేడిచేయును. విపాకమున కారపు రుచిగా మారుతుంది. గిలిగిచ్చ వాత, కఫములను హరిస్తుంది. రక్తదోషమును పోగొడుతుంది. అజీర్ణముతో వచ్చిన జ్వరము, సన్నిపాత దోషములను, కంఠరోగములు, ముఖ రోగములు శమింపచేస్తుంది.
చర్మరోగములకు గిలిగిచ్చ మందు
గిలిగిచ్చను చర్మరోగముల నివారణలో వినియోగిస్తారు. గిలిగిచ్చ ఆకులు లేదా చిగుళ్ళు నూరి పైన రాసినట్లయితే చిడుము, గజ్జి, కుష్ఠము మొదలగు బాధాకరమైన చర్మరోగములు శమిస్తాయి.
రసపట్లకు
ఆకుల రసము పుక్కిలించడం కాని ఒక చెంచాడు రసమును తాగడం కాని చేసినట్లయితే నోరుపట్టేయడం, చొల్లుకారడం వంటి వ్యాధులు తగ్గుతాయి.
సుఖప్రసమునకు
బాగా పండి ఎండిన గిలిగిచ్చ కాయలలోని నల్లగింజలను తీసి మెత్తని పొడిచేసి, అరచెంచాడు పొడిని కొంచెం మంచినీటితో కలిపి తాగించినట్లయితే ప్రసవము కాక కష్ఠపడుతున్న స్రీకి రెండు గంటలలో సుఖ ప్రసవము అవుతుంది.