అంజీరుపండు, అంజీఫలము మధ్యరకపు చెట్టు. ఆకులు అత్తిచెట్టు ఆకులను పోలి ఉంటాయి. పండు జీడిమామిడిపండును పోలి ఉంటుంది. మేడిచెట్టు జాతిలోనిది. దీనిని సీమమేడి అని కూడా పిలుస్తారు.
అంజీరుపండు గుణములు
- అంజీరుపండు మిక్కిలి చలువచేస్తుంది.
- తీపిరుచి కలిగి ఉంటుంది.
- విపాకమున కూడా తీపి రుచిగానే ఉంటుంది.
- గురుత్వము కలిగినది.
అంజీరుపండుతో ఉపయోగాలు
- అంజీరుపండు అతి తీవ్రమైన రక్తపిత్తములను తగ్గిస్తుంది.
- విశేషముగా ముక్కునుండి కారెడు రక్త ప్రవాహమును అరికడుతుంది.
- పైత్య సంబంధమైన శిరోబాధలను తగ్గిస్తుంది.
- శ్లేష్మమును, ఆమవాతమును కలిగిస్తుంది.
- ఆకుల రసము బొల్లికి మంచిది.
- ఈ పండును ఎండబెట్టి నిలువ ఉంచుకోవచ్చు.
- ఎండినపండు సమశీతోష్ణ గుణము కలిగి ఉంటుంది. మిగిలిన గుణములన్నీ పచ్చి అంజూరుతో సమానమే.