త్రిదోషహారి ఆకుపత్రి

తేజపత్ర, లవంగపత్రి అని కూడా దీనికి పేరు. లత జాతిలోనిది. లవంగపు తీగ యొక్క ఆకులనే ఆకుపత్రి అంటారు. ఇది మూడు అంగుళముల వెడల్పు కలిగి 8 అంగుళముల పొడవుగ ఉంటుంది. ఆకు మంచి సువాసన కలిగిఉంటుంది.  

ఆకుపత్రి గుణములు

  • ఆకుపత్రి తీపి, చిరుచేదు కలగలిసిన రుచితో ఉంటుంది. 
  • వేడి చేసే స్వభావము ఉంటుంది. 
  • విపాకమున కారపు రుచిగా మారుతుంది. 
  • వాత శ్లేష్మములను తగ్గిస్తుంది. 
  • వాంతి, అరుచి పోగొడుతుంది. 
  • పొత్తికడుపులోని దోషములను తగ్గిస్తుంది. 
  • దురదలు పోగొడుతుంది. 
  • మూలశంకలు నశింపచేస్తుంది.
  •  త్రిదోషములను హరిస్తుంది. 
  • గుడెదడలు అరికడుతుంది. 

ఆకుపత్రి ఔషధములు

  • ఆకుపత్రి చూర్ణము, వస చూర్ణము సమానముగా కలిపి సస్యమును చేస్తే పార్శ్వ శూలలు పోతాయి. 
  • ఆకుపత్రి, దాల్చినచెక్క, ఏలకులు, నాగ కేసరములు ఒక్కొక్క భాగము వంతున కలిపి మెత్తగా చూర్ణము చేసి తేనెతో సేవించినట్లయితే సమస్త పైత్యములు, శ్లేష్మములు ఆమ వికారములు కడతాయి. దీనినే చాతుర్జాతక చూర్ణము అంటారు. మంచి బలకరమైనది.  
  • ఆకుపత్రి కషాయము తాగినట్లయితే వ్రణములు హరిస్తాయి. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.