కివి పండులో ఎన్నో ఆరోగ్య గుణాలు దాగి ఉన్నాయని డాక్టర్లు తెలియచేస్తున్నారు. అధికంగా పీచు పదార్ధం కలిగిన కివిని శాస్త్రీయంగా ఆక్టినిడియా డెలిసియోసా అని పిలుస్తారు . కివి ఫ్రూట్ భారతదేశీయులకు ఎక్కువగా పరిచయం లేనప్పటికీ దీని వాడకం వల్ల ఎంతోమేలు కలుగుతుందనే ఉద్దేశంతో భారతీయులు కూడా ఈ మధ్య విరివిగా వినియోగిస్తున్నారు. ఇది చైనాకు చెందినది మరియు ఉత్తర చైనాలోని చాంగ్ కియాంగ్ లోయ (యాంగ్ టావో) పర్వత శ్రేణులలో ఉద్భవించింది.
కివి ప్రయోజనాలు
- కివి పండులో అధికంగా పీచుపదార్ధం ఉంటుంది. కాబట్టిఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.
- ఎముకల బలహీనతను పోగొడుతుంది.
- క్యాన్సర్, ఆస్తమా వంటి జబ్బుల నుండి మనల్ని కాపాడుతుంది.
- విటమిన్ సి, ఎ, ఇ లు పుష్కలంగా కలిగి ఉన్నకివి కండరాలకు మంచి రూపాన్నిచ్చి అందంగా పెరిగేలా దోహదపడుతుంది. బాడీబిల్డర్లు కావాలనుకునేవారు కివి పళ్ళను ఎక్కువ తీసుకుంటే మంచిది.
- శరీరంలో తయారయ్యే ప్రీ రాడికల్స్ ను అదుపు చేస్తాయి.
- గర్భిణులకు కివి పండు ఎంతో మేలు చేస్తుంది.
- పేగు క్యాన్సర్ ను నివారించి కొలెస్టరాల్ ను నియంత్రిస్తుంది.
- కమలాపండు, బత్తాయి పండులో కంటే అధికంగా సి విటమిన్ కివి పండులో లభిస్తుంది.
- శ్వాసక్రియ బాధలను తరిమికొట్టే మంచి పండు కివి.
- కివి పండు తినటం వల్ల ఆస్తమా నుంచి కోలుకుంటారని ప్రకృతివైద్యం చెబుతోంది.
- గుండె జబ్బులను పోగొట్టే మంచి పండు.
- ప్రకృతి మార్పువల్ల, నీటి కాలుష్యం వల్ల వచ్చే పొడి దగ్గును తగ్గిస్తుంది.
- ప్రకృతిపరంగా లభించే కివి చాలా అరుదుగా లభిస్తుంది. ఆయాసీజన్లలో లభించే కివి పండును తప్పక సేవిస్తూ ఉండాలి.
- కివి పండు తింటే కలకాలంఆరోగ్యంగా ఉంటారు.