కమలాఫలంలో ఆరోగ్య గుణాలు

కమలాఫలంతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  తినటం ద్వారా వచ్చే ప్రయోజనాలతోపాటు పైపూతలుగా కూడా ఉపయోగపడే ఈ కమలాఫలం వల్ల వచ్చే లాభాలను గురించి తెలుసుకుందాం.

  • రోజూ ఒక కమలా ఫలం తింటే క్యాన్సర్ సమస్య తలెత్తదని అంటున్నారు పరిశోధకులు. విటమిన్ సి, బి, పొటాషియం, కాపర్, సోడియం, మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు లభిస్తాయి. 
  • క్షయ, ఉబ్బసంతో బాధపడేవారు రోజుకో కమలాఫలం తీసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. 
  • మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా చూడటం, శరీరంలో క్రొవ్వుస్థాయిని తగ్గించడంలోనూ ఓ అద్భుత ఔషధంగా పనిచేస్తుంది కమలాఫలం. 
  • మొహంమీది మొటిమలు, మచ్చలు ఉన్నవారు కమలాఫలం రసానికి వేపాకుల పొడి కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుని ఆరినతర్వాత కడిగేయాలి. ఇలా  అప్పుడప్పుడూ చేస్తూ ఉంటే చక్కని సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది.
  • కమలాపండు తొక్కల్ని స్నానంచేసే నీటిలో కలిపి స్నానం చేసినట్లయితే శరీర దుర్వాసన పోతుంది.
  • చర్మం జిడ్డుతత్త్వం ఉన్నవారు కమలాఫలం తొక్కలపొడి, ఫలం గుజ్జు, పాలు కలిపి పేస్టులా చేసి ముఖానికి పూసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మూసుకుపోయిన స్వేదగ్రంధులు తెరుచుకుని జిడ్డును తొలగిస్తాయి. 
  • శనగపిండిలో లేదా సున్నిపిండిలో కమలాపండు తొక్కల పొడి కలిపి నలుచుకుంటే శరీరం కాంతివంతంగా మారుతుంది.
  • కమలాపండు తొక్కల పొడిని పొగవేస్తే దోమలు రావు. 
  • కమలా తొక్కల్ని మరుగుతున్న టీ లో వేస్తే టీ ఎంతో సుమాసనగాను, రుచిగాను మారుతుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.