శ్వేతలామజ్జక రూట్స్ ఆఫ్ వైట్ కస్ కస్ అనే శాస్త్రీయ నామము కలిగిన తెల్ల వట్టివేరు రెల్లు దుబ్బు జాతిలోనిది. దుబ్బు ఆకృతి వేరు దుబ్బువలె ఉంటుంది కని కొంచెం తెల్లగా ఉంటుంది. వేరు, పువ్వు కూడా తెల్లగానే ఉంటుంది. విశేష గుణము గలదైనది అగుటచే దీనికి ప్రత్యేకత కల్పించడం జరిగింది.
తెల్ల వట్టివేరు గుణములు
ఈ వేరు కొంచెం చేదు రుచిగా ఉంటుంది. సువాసన కలిగి ఉంటుంది. శీతవీర్యము, చలువ చేస్తుంది. విపాకమున కారపు రుచిగా మారుతుంది. లఘుగుణము కలది. మూడు దోషములను హరిస్తుంది. మూత్రకృచ్ఛములలో అమోఘముగా పనిచేస్తుంది. రక్త పిత్తమును హరిస్తుంది. దప్పిని, తాపమును శమింపచేస్తుంది. నోటి దుర్గంధమును, శరీర దుర్గంధమును బోగొడుతుంది. శ్వేత ప్రదరములయందు, శుక్ల నష్టములను అరికడుతుంది. వట్టివేరుకు ఉండే గుణములే దీనికి ఉంటాయి.