ఇంగుపత్రిలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీనినే హింగుపత్రి అని కూడా అంటారు. ‘ఫెరులా’ , ‘అసఫోటిడా’ అనే శాస్త్రీయ నామం కలిగిన ఇంగువచెట్టు ఆకులనే హింగు పత్రి అంటారు. ఇంగువతో పాటు ఇంగువ చెట్టు పత్రికి కూడా ప్రత్యేక ఉపయోగములు ఉండుటచే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది.
ఇంగుపత్రి గుణములు
- ఇంగుపత్రి మిక్కిలి వేడి చేసే గుణము కలిగి ఉంటుంది. కారపు రుచిగా ఉంటుంది. మంచి జీర్ణకారి. రుచిని పుట్టిస్తుంది. గుండెకు చాలా మంచిది. మంచి సువాసన కలిగి ఉంటుంది.
- కఫ వాతములను, ఆమ దోషములను, పొత్తి కడుపులో కలిగే వ్యాధులను పోగొడుతుంది. మలబద్ధమును చేస్తుంది.
- మూలశంకలు, గుల్మవ్యాధులు, మేదో రోగములను హరిస్తుంది.
- ఇంగుపత్రి రసమును వెచ్చచేసి చెవిలో పిండినట్లయితే కర్ణశూలలు శమిస్తాయి. ఆకును వెచ్చచేసపి రసమును తీసి, ఆ రసము ఆముదములో కలిపి పిల్లలకు పట్టించినట్లయితే గవదబిళ్ళలు, అజీర్ణవాతములు, కడుపు ఉబ్బరము, క్రిములు హరిస్తుంది.