సంస్కృతములో విదరము అనీ, విశ్వసారకము అనీ అందురు. ఈ మొక్క మొదట అమెరికా ఖండమునకు చెందిన మూలిక. పోర్చుగీసువారు మనదేశములో ప్రవేశపెట్టారు. రాజస్థాన్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తాయి.
నాగచెముడు గుణములు
నాగచెముడు ఆకులు దళసరిగాను, కోలగాను, పొడవుగాను ఉంటాయి. పండు గుజ్జునుగాని, పానకముగా గాని వాడినచో ఉబ్బసము, కోరింత దగ్గు, శ్లేష్మ వ్యాధులు ఉపశమించును. ఆకుల రసమును కూడా సెగ వ్యాధిని పోగొట్టడానికి వినియోగిస్తారు. పాలవంటి దీని రసము పది చుక్కలు పంచదారతో కలిపి తినినట్లయితే చక్కగా విరేచనమగును. ఆకులు ముద్దచేసి కట్టినచో వ్రణములు పగులును. ఆరని కురుపులు మానును. ముండ్లు, పై చర్మము తీసివేసి ఆకుల గుంజు రసము తీసి ఇచ్చినచో వాతగుల్మములు, గ్రంధులు, రక్త విరేచనములు ఆగిపోవును. శ్వాసకాశలు, ప్రమేహములు హరించును.