టమాటోలతో ఉపయోగాలెన్నో

టమాటాలకుసీమ వంకాయలు అని కూడా పేరు. ఇవి అమెరికాలో పుట్టి యూరప్ దేశాలకు పాకి మన దేశానికి కూడా వచ్చి ప్రబలినవి. శీమ నుండి వచ్చుల వలనను, ఈ దేశాన్ని ఏలిన దొరలు అధికంగా ఇష్టపడి తినడం వల్లను మన దేశీయులు కూడా వీటిని విరివిగా వినియోగించడం అలవరుచుకున్నారు. 

‘‘ లైకోపెర్సికం ఎస్క్యులెంటమ్’’ అనే శాస్త్రీయనామం కలిగిన ఈ టమాటోలు పులుపు, తీపి రుచులు కలగలిసి ఉంటాయి. వీటిని అనేక రకాల కూరలతో పాటు, స్నాక్స్ లో కూడా వినియోగిస్తుంటారు.  ఈ టమాటోలు శీతవీర్యము కలిగినవి. ఆకలి పుట్టిస్తాయి. శ్వాసకాసలు, క్షయ పోగొట్టును. సెగరోగము కలిగిన వారికి చాలా మంచిది, రక్తశుద్ధి చేయుటలో దీనికి మంచి శక్తి ఉన్నది. 

మొత్తంమీద మంచి కూరగాయలలో ఇది ఒకటి. ఈ టమాటోలను పండుగా కూడా తింటారు ఈ పండు రక్తపుష్టి, రక్తశుద్ధి, వీర్యవృద్ధి కలిగిస్తుంది.  

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.