పానకము వల్ల కలుగు లాభాలెన్నో...

బెల్లము గాని, పంచదార గాని నీళ్ళలో కలిపి చేసినది పానకము. అందులో నిమ్మరసమైనను, మరొక ఆమ్ల ద్రవ్యమైనా చేర్చవలెనని ఆయుర్వేదము చెప్పుచున్నది. అదియే మంచిది.  

పానకము గుణములు

  • ఇది చలువచేయును. శ్రమ, ఆకలి, దప్పిక, గ్లాని పోగొట్టును. మలబంధము చేయును. మూత్రము జారీఅగునట్లు చేయును. 
  • పానకములో ఏదయినా ఆమ్లద్రవ్యము చేర్చుటకు బదులుగా మిరియపు పొడి కలిపే సంప్రదాయము కలదు. చెరుకుకర్రలనుండి రసము తీయునపుడు కర్రకు నాట్లు వేసి, అందులో మిరియాలు గాని, పచ్చిమిరపకాయలు గాని ఉంచి గానుగులో పెట్టి రసము తీయడం కూడా ఉంది.
  • పానకము ఆకలి తగ్గించును. పానకము పరగడుపున పుచ్చుకొనినచో సోలెడు బియ్యపు అన్నము తినగలుగువాడు అరసోలెడు బియ్యపు అన్నము అయినను తినలేడు.  భోజన సమారాధనములు జరుపునప్పుడు అంచనా కంటే ఎక్కువమంది భోక్తలు వచ్చినట్లయితే రభస కాకుండా ముందుగా పానకములు ఇస్తారు. దీనితో భోజన పదార్ధములు సరిపోయి మర్యాద దక్కుతుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.