తులసిని మనం నిత్యము లక్ష్మీ స్వరూపంగా కొలుస్తూ ఉంటాము. ఇక ఆయుర్వేదంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. ఆనేక వ్యాధులను నయం చేయడానికి తులసిని వాడుతూ ఉంటారు. తులసి ఆకుల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి.
కృష్ణ తులసి చెట్టు సమూలముగా నల్లగా ఉంటుంది. వాతము, నులిపురుగులు పోగొడుతుంది.
ఆకలి పుట్టిస్తుంది. శ్లేష్మము హరిస్తుంది. మలబద్ధకము, జలుబు తగ్గిస్తుంది.
పిల్లికూతలు, జ్వరము, అరుచి తగ్గిస్తుంది.
రోజూ ఉదయం రెండు కృష్ణతులసి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరిగి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని జంతువులపై చేసిన అధ్యయనంలో తేలింది. తులసి చెట్టు నుంచి వచ్చే గాలి సహితము ఔషధయుక్తమే. అందుకే ప్రతీ ఇంటి ముందు ఈ తులసి చెట్టును విధిగా పెంచుకోవాలి.