గుండె వ్యాధులను నివారించవచ్చిలా...

ఈ రోజుల్లో గుండె జబ్బులతో చాలామంది బాధపడుతున్నారు. ఈ జబ్బులు రాకుండే ఉండేందుకు మంచి మందు ఉంది. ఆ మందు తయారీని గురించి తెలుసుకుందాం.

మందు తయారీ

అల్లం నార లేకుండా తీసి దంచిన రెండు చెమ్చాలు, బెల్లంపొడి రెండు చెమ్చాలు, తెల్ల నువ్వుల పొడి నాలుగు చెమ్చాలు, వస చూర్ణం రెండు చెమ్చాలు, ఇంగువ ఒక చెమ్చా, కరక్కాయల చూర్ణం రెండు చెమ్చాలు, వాయు విళంగచూర్ణం రెండు చెమ్చాలు తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి పూర్తిగా కలిసేలా నూరాలి. ఈ ముద్దను ఉసిరికాయ సైజులో గోళీలుగా చేయాలి. ఈ గోళీని రోజూ పరగడుపున ఒకటి, రాత్రి పడుకోబోయే ముందు ఒకటి తీసుకుని వేడినీరు తాగాలి. ఇలా మూడు వారాలపాటు తప్పనిసరిగా వాడినట్లయితే పరిణామ శూలలు, మూలశంకలు, ఆమవాతాలు, స్థూలదేహము, ముఖ్యంగా హృదయ వ్యాధులన్నీ తొలగిపోయి రక్తప్రసరణ లక్షణంగా సాగి పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. 

మరోమందు: 

శివమారేడు ఆకులను తెచ్చి దంచి రసంతీసి కొద్దిగా మిరియాలపొడి, కొద్దిగా దాల్చినచెక్క, కొద్దిగా వెల్లుల్లి గుజ్జు  తీసుకోవాలి. వీటిని అరకప్పు నీటిలో కొద్దిగా తేనె కలిపి, తరువాత పై మిశ్రమం అరచెమ్చా కలిపినట్లయితే చిక్కగా ద్రావకం తయారవుతుంది. దాన్ని పరగడుపున త్రాగి  తరువాత వెచ్చచేసిన పాలను తీసుకోవాలి. అరగంట తరువాత ఆహారం తీసుకోవచ్చు. ఈ విధానం క్రమంగా నెలరోజులపాటు పాటించినట్లయితే వాత, పిత్త, శ్లేష్మ సంబంధిత సర్వరోగాలూ తొలగిపోతాయి. వీటితోపాటు పచ్చిమిరప, బంగాళాదుంప, చేప, కోడి, నూనె, అధికంగా నెయ్యి వాడకం మానుకోవాలి. చింత లేకుండా ఉండాలి. సంభోగానికి తిలోదకాలిస్తేనే ప్రాణం మిగిలేది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.