గుంటకలగరతో నల్లని ఒత్తైన జుట్టు


భృంగ, మార్కవ అనే పేర్లుగల గుంటగలగర మొక్క ఎంతో ఉపయోగకరమైనది. ఈ మొక్కలో తెల్లపువ్వులు, పచ్చపువ్వులు, నలుపుపువ్వులు కలిగినవి ఉంటాయి. గుంటకలగర మొక్క ఎక్కువగా నీరు ఉన్న ప్రదేశాల్లో పెరుగుతుంది. మెట్ట ప్రాంతాల్లో తక్కువగా కనిపిస్తుంది. దీని సర్వాంగములు ఉపయోగకరమైనవే. 

నల్ల గుంటకలగర

ఆకులు, పువ్వులు, కాడలు కూడ నల్లగా ఉంటాయి. సంస్కృతములో దీన్ని నీలభృంగరాజము, మహాభృంగము, మహానీలము అనే పేర్లతో వ్యవహరిస్తారు. ఈ మొక్క దొరకడం చాలా కష్టము. నల్ల గుంటకలగర శ్రేష్టమైనది. గుంటకలగర వాడవలసి వచ్చినపుడు ఈ నల్ల గుంటకలగర వాడటం చాలా మంచిది. నల్లగుంటకలగర రసాన్ని ఒంటికి పూసుకుంటే అదృశ్యయోగము సిద్ధించుననీ, జరామరణములు కలుగవనీ పెద్దలు నమ్మేవారు. కనుకనే ఈ మొక్క లభ్యమవడం చాలా కష్టం. ఈ మొక్క కండ్లకు మేలు చేస్తుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా పెరగడానికి ఉపకరిస్తుంది. ఉబ్బు, బొల్లి తదితర వ్యాధులు తగ్గిస్తుంది. 

గుణములు:

నల్లగుంటకలగర చిరుచేదు రుచిగా ఉంటుంది. వేడిచేసే స్వభావము కలిగి ఉంటుంది. కఫ వాతములను హరిస్తుంది. ఉబ్బురోగములు, వాపులు, విషములు హరిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. నేత్రవ్యాధులకు, శిరోవ్యాధులను నిర్మూలిస్తుంది. క్రిములను చంపుతుంది. గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది. చర్మరోగములను శమింపచేస్తుంది. దంత వ్యాధులను అణచివేస్తుంది. 

పచ్చ గుంటకలగర

సంస్కృతములో స్వర్ణబంగారము అని వ్యవహరిస్తారు. పచ్చపువ్వులు కలిగిన ఈ మొక్క కళ్ళకు మేలు చేస్తుంది. కఫము, ఆమము, ఉబ్బు హరిస్తుంది. 

ఒంటి, కణతనొప్పులకు

గుంటకలగర రసము, మేక పాలు సమానముగా కలిపి ఎండలో ఇగరనిచ్చి అది పూసినట్లయితే ఎటువంటి నొప్పులైనను తగ్గుతాయి. 

పుండ్లకు

గుంటకలగర రసముతో పుండ్లను కడిగినట్లయితే స్పిరిట్ లాగ పనిచేసి పుండ్లను మాన్పుతుంది.

రక్త విరోచనాలు

గుంటకలగర చూర్ణమును రసముతో నూరి మాత్రలలా చేసి లోనికి తీసుకున్నట్లయితే రక్త విరోచనాలు కడతాయి. కడుపునొప్పి కూడా తగ్గుతుంది. 

రేచీకటి

చేపగుడ్డు గుంటకలగర రసంతో సేవించినట్లయితే రేచీకటి తగ్గును. ఏడు రోజులపాటు ఇలా చేసినట్లయితే రేచీకటి నుంచి బైటపడవచ్చు.

తెల్ల వెంట్రుకలకు

ఆవుపాలు, గుంటకలగర రసం, యష్టిమధుకం, నువ్వులనూనె ఇవన్నీ చేర్చి నూనెను మరిగించి ఆ కషాయముకలిగిన నువ్వులనూనెను తలకు పూసినట్లయితే అకాలములో తెల్లబడిన వెంట్రుకలు నల్లబడతాయి. 

వెంట్రుకలు నల్లబడటానికి

గుంటకలగర పువ్వులు, మందార పువ్వులు మేకపాలతో నూరి ఆ ముద్ద ఇనప పాత్రలో ఉంచి వారమురోజులు భూమిలో పాతిపెట్టి తీసి దానిని మరల గుంటకలగర రసముతో నూరి తలపై మర్దనా చేసి ఒక రాత్రి అలాగే ఉంచి మరునాడు తలస్నానం చేసినట్లయితే వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా తయారవుతాయని వస్తుగుణ ప్రకాశిక గ్రంథంలో పేర్కొనబడింది. 

గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి

గుంటకలగర చూర్ణము, కరక్కాయ చూర్ణము, పాతబెల్లముతో కలిపి సేవించినట్లయితే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. 

బొల్లికి

లోహ పాత్రలో నూనెవేసి అందులో గుంటకలగర వేయించి తిని, పాలు తాగినచో బొల్లి తగ్గుతుంది. 

ఉబ్బులకు

గిద్దెడు గుంటకలగర రసములో రెండు చెంచా ఉప్పు కలిపి పరగడుపున సేవించినట్లయితే వాపులు తగ్గుతాయి. 

జ్వరములకు

మిరియాలు గుంటకలగర రసముతో నూరి మాత్రలు కట్టి గుంటకలగర రసముతో సేవించినట్లయితే జ్వరములు తగ్గుతాయి. 

శిరోవాతమునకు

భృంగామ్లక తైలం మర్దనాచేసినట్లయితే శిరోవాతము తగ్గుతుంది. ల


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.