మామూలు ద్రాక్ష వలే ఇది అడవులలో ప్రాకుతుంది.. పండ్లు వగరు, తీపి కలిసిన రుచి కలిగి ఉండును. చలువచేయును. గురుత్వము కలది. రక్తదోషము పోగొట్టి రక్తమును వృద్ది చేస్తుంది. అయితే దీన్ని సేవించడం వల్ల ఆకలి మందగించును.
ఎలా ఉపయోగించాలి?
ఒక స్పూను పండ్ల రసము లోనికి పుచ్చుకున్నట్లయితే బాగా నిద్రపడుతుంది. పండ్ల కషాయము పుక్కిలించినచో గొంతుకలోని పొక్కులు నశిస్తాయి. దీని రసము కంటిలో వేసినట్లయితే మసక బారిన కండ్లకు కాంతి వస్తుంది. దీని ఆకులు విస్తరి కుట్టి శిరస్సునకు కట్టినట్లయితే తలనొప్పి శమించును.