సైంధవ-సింధూద్భవ-లవణోత్తమ-Rock Salt Sodium Chloride Impura. ఇది సింధు దేశములో విస్తారముగా పెరుగుతుంది. దీనిని గనులనుండి తవ్వితీస్తారు. ఇది మంచు గడ్డ లాగ ఉంటుంది. తెల్లని పాషాణపు రాళ్ళవలె ఉంటుంది. దీనిలో రమారమి సగభాగము జాలము ఉంటుంది. ఉత్తరభారతదేశములో సైంధవలవణము మిక్కిలి వాడుకలో ఉంటుంది. దక్షిణభారత దేశంలో దీని వాడకం తక్కువ. ఇది లవణములలో కెల్ల శ్రేష్ఠమైనది.
గుణములు
ఇది శీతవీర్యమైనది. మృదుగుణము కలది. కావున దీనికి పైత్యమును హరించే శక్తి కలదు. మిక్కిలి వీర్యవృద్ధి కలిగిస్తుంది. నేత్రములకు హితకరము. ఆకలిని పుట్టిస్తుంది. త్రిదోషములను హరిస్తుంది. పవిత్రమైనది. వ్రణములను, మలబద్ధకమును తగ్గిస్తుంది. ఇందులో రెండు రకములు
కలవు. తెలుపు, ఎరుపు. ఇవి రెండూ సమాన గుణములను కలిగి ఉంటాయి.
అజీర్ణములకు, అంత్రరోగములకు
సైంధవలవణమును వేడినీళ్ళలో కలిపి త్రాగించిన వాంతి అగును. ఇది ఆమాశయ శోధనమునకు గాను వాడవలెను.
వదవనార చూర్ణము
సైంధవలవణము, పెద్ద పిప్పళ్ళు, చిత్రమూలము, అల్లము, కరక్కాయ సమానభాగాలుగా చూర్ణమును చేసి పావుచెమ్చా వంతున నీళ్ళలో కలిపి రెండు పూటలా ఇచ్చినట్లయితే అజీర్ణములు మొదలగునవన్నీ తగ్గుతాయి.
పదిణామ శూలలను తగ్గిస్తుంది. భగంధరమునకు సైంధవాది తైలము, సైంధవలవణము, చిత్రమూలము, నేపాళపు వేరు, మోదుగ చెక్క, చేదుపుచ్చ ఈ వస్తువులన్నింటినీ సమభాగములుగా గ్రహించి ఎనిమిదిరెట్ల నీళ్ళలో వేసి ఎనిమిదవ భాగము మిగిలేవరకూ కాచాలి. తరువాత ఆ ద్రావణాన్ని వడకట్టి, దానికి నాలుగవ వంతు నూనెను కలిపి తిరిగి నూనె మిగిలే వరకూ కాచవలెను. ఈ తైలమును పైన పూసినట్లయితే భగందరములు హరిస్తాయి. ఈ తైలము మరుగుచుండగా తంటెపువేరు కల్కమును వేసి కాచవలయును. తైలము తయారై దింపిన తరువాత గంగసింధూరమును వేసి కలపవలెను. ఈ తైలమును పైన రాసిన దారుణమైన గండమాలలు హరిస్తాయి.
కంటి జబ్బులకు
ఒక చెంచా చనుబాలలో ఒక చిటికెడు సైంధవలవణం కలిపి కంటిలో వేస్తూ ఉంటే కంటి వ్యాధులన్నీ హరిస్తాయి. సుప్రసిద్ధమైన నారికేళాంజనము నందు సైంధవలవణము ఎక్కువగా ఉంటుంది. సైంధవలవణములో వేలకు మించిన యోగములు ఉన్నాయి.