ఆయుర్వేదంలో వావిలి వైద్యం


వావిలి అనే మొక్క నీటిసదుపాయం కలిగిన కొండవాగులు, ఏర్లు, కాలువల ప్రాంతాల్లో ఎక్కవుగా లభిస్తుంది. 15 అడుగుల ఎత్తు వరకూ గుబురుగా ఈ మొక్క పెరుగుతుంది. ఈ మొక్క వేర్లు, ఆకులు, విత్తనాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.  

వావిలినిశాస్త్రీయంగా వైటెక్స్‌ని గుండో అన్నేయస్ అని పిలుస్తారు. వెర్బినేసీ కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్కను పైల్స్‌వ్యాధి, గర్భాశయ, ప్లీహ వ్యాధులు, వాపులు, కడుపులో క్రిములు, దగ్గు, ఆస్త్మా, గ్రంధుల వాపులు వంటి పలు వ్యాధుల నివారణలో వినియోగించే ఆయుర్వేద మందుల్లో వాడతారు.

వావిలి మొక్కలో నిషిండైన్ అనే ఆల్కలాయిడ్, హెంట్రియాకోంటీన్, పెంటాట్రికొంటీన్ బీటా-సైటోస్టీరాల్ లాంటి రసాయనాలు నిక్షిప్తమై ఉంటాయి.  

వావిలిని ఆయుర్వేదంలో ఎలా వాడతారు?

  • వావిలి మొక్క వేరు రసాన్ని పాముకాటుకు విరుగుడు గా వాడతారు.
  • పత్రరసాన్ని ఆవనూనెతో కలిపి చర్మవ్యాధుల నివారణకు వినియోగిస్తారు.
  • పత్రాల కషాయంతో ప్లీహ, కాలేయ వ్యాధులు నివారణ అవుతాయి. 
  • వావిలి పత్రాల పొడిని నెయ్యి మిశ్రమంగా దగ్గు తగ్గడానికి ఇస్తారు.
  • ఆకులు నూరి తలపై పట్టు వేస్తే తలపోటు పోతుంది.
  • ఎండబెట్టిన ఆకులను పొడిగా చేసి వాముతో కలిపి తింటే కడుపునొప్పి తగ్గుతుంది.

ఆయుర్వేద మందులు

వావిలి మొక్కతో నిర్గుండితైలం, నిర్గుండికల్పం, పచాదితైలం, రస్నాదితైలం, ఔత్యాదితైలం, అష్టవర్గ కషాయం వంటి ఆయుర్వేద మందులలో వాడతారు. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.