కన్నెకోమలితో జీర్ణసంబంధ వ్యాధులు మాయం


అజీర్ణరోగాలకు, జ్వరాలకు వనమూలికావైద్యంలో ఉపయోగించే మొక్క కన్నెకోమలి. గిరిజన ఆయుర్వేదవైద్యులు సైతం గ్రామాల్లో చేసే వైద్యంలో ఈ మొక్కను ఉపయోగిస్తారు. తూర్పు ఏజెన్సీ ప్రాంతంలోని అడవుల్లో లభించే ఈ మొక్కను వైద్యం కోసం ఇళ్ళల్లో కూడా వేసుకుంటున్నారు. సుమారు మూడు మీటర్ల ఎత్తు వరకూ తీగలా ఎగబాకే ఈ మొక్క ఆకులు, కాండం వంటివి ఆయుర్వేద చికిత్సలో ఉపకరిస్తున్నాయి.  

కన్నెకోమలి మొక్కలో ఔషధగుణాలు

  • దుంప చేదు, వగరు గుణములు కలిగి ఉంటుంది. వేడిచేసే స్వభావము కలిగి ఉంటుంది. 
  • త్రిదోషములను హరిస్తుంది. 
  • దుంప రసమును మేకపాలతో కలిపి పరగడుపున తీసుకుంటే శుక్ల నష్టములు నివారింపబడతాయి. ఇలా వారమురోజుల పాటు సేవించినచో ఫలితము కనపడుతుంది. 
  • కన్నెకోమలి ఆకుల రసములో కొబ్బరినూనె కలిపి రాసినట్లయితే కాలిన పుండ్లు మాయమవుతాయని వస్తుగుణప్రకాశిక అనే గ్రంథం వివరిస్తోంది. 
  • దగ్గు, వళ్ళునొప్పులు, జ్వరాలు, ఉదరసంబంధ వ్యాధులు వంటివి కన్నెకోమలి మొక్కద్వారా నివారణ అవుతాయి. 
  • పత్రాల కషాయం, వేరు చూర్ణం వంటి రూపాల్లో ఈ మొక్కను మందుగా వాడతారు.
  • కాండాన్ని ఎండబెట్టి చూర్ణంగా తీసుకుంటే జ్వరం నయమవుతుంది. 
  • కడుపులోని జీర్ణసంబంధ వ్యాధులు కూడా నివారణ అవుతాయని వైద్యులు చెబుతున్నారు. 
  • గ్రామీణప్రాంత ఆయుర్వేద వైద్యంలో ఈ కన్నెకోమలి మొక్కకు అత్యంత విశిష్టత ఉంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.