మలేరియాకు మందు తులసి వేరు

 


హిందువుల ఆరాధ్యదైవంగా భాసిల్లుతున్న తులసి ఆయుర్వేదపరంగా దివ్య ఔషధం వంటిది. యుజినాల్, కారియోఫిల్లీస్, మిథైల్‌యుజినాల్ అనే రసాయనాలు కలిగి ఉన్న ఈ తులసి మొక్కను సురషాదిఫంతి, తులస్వాది తైలం, మనసామిత్ర వాటకం వంటి ఆయుర్వేద ఔషధాలకు ప్రధానంగా వాడతారు. 

ఆయుర్వేదంలో...

  • తులసి వేరు కషాయాన్ని మలేరియా జ్వరం నివారణకు ఉపయోగిస్తారు. 
  • ఆకులతో తీసిన రసంలో కొద్దిగా అల్లం రసం కూడా కలిపి సేవిస్తే కఫం కరిగిపోతుంది.
  • తులసి ఆకుల రసం చర్మవ్యాధులు, దురదలు, తామర వంటి వ్యాధులకు మంచి మందు.
  • సెగ్గడ్డలు కూడా ఈ తులసి ఆకుల రసం లోనికి పుచ్చుకున్నట్లయితే  తగ్గుతాయి. 
  • ఇసినోఫీలియాకు కూడా ఈ తులసి రసం మంచి ఔషధకారి.
  • తేనెతో కలిపి తులసి రసాన్ని స్వీకరిస్తే అన్ని రకాల జ్వరాలకు పనిచేస్తుంది.
  • తేనె, తులసి రసం కలిపి తీసుకుంటూ ఉంటే దగ్గు ఉపశమిస్తుంది. 

అసిమం సాంక్టమ‌లిన్నేయస్ అనే శాస్త్రీయనామం కలిగిన తులసి మొక్క సాధారణంగా కొన్ని గృహాల్లో చిన్న చిన్న వ్యాధులకు ఔషధంగా వాడుతూనే ఉన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.