ఉసిరితో గుండెకు బలం

 

ఉసిరి  ఎంబ్లికా అఫిసినాలిస్ గర్ట్‌నర్ అనే శాస్త్రీయనామం కలిగినది. యుఫర్బియేసి కుటుంబానికి చెందినది ఈ ఉసిరి. ఇది ఎనిమిది మీటర్ల వరకూ పెరిగే వృక్షం. చిన్న చిన్న కొమ్మలపై పత్రాలు ఏర్పడతాయి. పత్రాలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. పుష్పాలు ఏకలింగకం, లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఫలాలు గుండ్రంగా ఆకుపచ్చగా ఉండి, పండినప్పుడు లేత పసుపు రంగులో నిలువు చారలను కలిగి ఉంటాయి. 

పుష్పాలు, ఫలాలు

పుష్పాలు ఫిబ్రవరి-మార్చి మాసాలలోను, ఫలాలు అక్టోబరు-ఏప్రిల్ మాసాల లోను ఏర్పడతాయి. 

లభించే ప్రదేశాలు: 

  • ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ లోని అన్ని అరణ్యాలలో పెరుగుతుంది. 
  • ఉపయోగపడే భాగాలు:
  • ఫలాలను వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఇది త్రిఫలాలలో ఒకటి. 
  • రసాయన పదార్ధాలు: ఈ మొక్క ఫలాలలో విటమిన్-సి, ఫల్లాంటిడ్రైన్, ఫిల్లాంటైన్, కెరోటీన్, నికోటినిక్ ఆమ్లము, రైబోఫ్లావిన్ వంటి అనేక రసాయన పదార్ధాలుంటాయి. ఈ ఉసిరి త్రిదోషహారి.
  • ఉపయోగాలు: మెదడును చల్లబరుస్తుంది. శుక్రాన్ని వృద్ధిచేస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది. విరోచనాలు, టైఫాయిడ్ ను తగ్గిస్తుంది. శరీరానికి శక్తినిస్తుంది. అలసటను మాన్పుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని వాయువును వెడలగొడుతుంది. 
  • అల్సర్, అజీర్ణం నివారిస్తుంది. 
  • మేధస్సును పెంచుతుంది. 
  • రక్తశుద్ధి, మూలశంఖ నివారణలో తోడ్పడుతుంది. దగ్గు, కండ్ల వ్యాధులు, కామెర్లు తగ్గిస్తుంది..
  • స్త్రీల ఋతుసంబంధ వ్యాధులను నివారిస్తుంది. 
  • కాలేయాన్ని చురుగ్గా పనిచేయిస్తుంద. జుత్తును నల్లబరుస్తుంది. 
  • మూత్రసంబంధ వ్యాధులను నివారిస్తుంది. దగ్గు, ఆస్థ్మా, బ్రాంఖైటిస్ లు తగ్గుతాయి. 
  • ఫలాల రసాన్ని పసుపు చూర్ణం, తేనెతోకలిపి తీసుకుంటే మధుమేహ వ్యాధి నివారణ అవుతుంది. పండ్ల వ్యాధులు, జ్వరాలు, రక్తహీనత, మూర్ఛ, ఫిస్టులా, గనేరియా, కలరా, స్త్రీలలో వంధ్యత్వం నివారణ అవుతాయి. 
  • ఎక్కువగా మూత్రం పోతుంటే పత్రాల రసాన్ని దారు హరిద్ర పంచదారతో కలిపి లోనికి తీసుకోవాలి.
  • ఫలాల చూర్ణాన్ని నెయ్యి, తేనెతో తీసుకుంటే ఆకలి పుడుతుంది. 
  • ఉసిరితో తయారుచేసే ఆరోగ్యవర్ధినిని కామెర్ల వ్యాధి నివారణలో వాడతారు.
  • ధాత్రీలేహను రక్తహీనత, కామెర్లు, అజీర్ణం నివారణకు వాడతారు. ధాత్రీ అరిష్టం ను వాడితే కామెర్లు, అజీర్ణం తగ్తుతాయి. 

ఆయుర్వేద మందులు

చ్యవనప్రాస్, బ్రహ్మ రసాయనం, ధాత్రీలోహం, త్రిఫల చూర్ణం, ఆమ్లకాది చూర్ణం, సుదర్శన చూర్ణం, సర్వ జ్వర లోహం, అగ్నితుండివటి, సంజీవని వటి, ఫలత్రకాదిక్వతం, పునర్నవమండూరం, నవవ్యాసలేహ, రక్తపత్తకాంతలేహ, పిప్పలాసవం, శృంగ్యాధిచూర్ణం, కరంజాదియోగం, ధాత్రీరసాయనం, త్రిఫలాదితైలం, మహత్తికఘృతం. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.