సున్నముతో బహుప్రయోజనాలు

 

సున్నములో రెండు రకములు ఉన్నాయి. రాళ్ళను కాల్చి తయారు చేసినది మరియు సముద్రపు ఒడ్డున ఉండే జలజంతువుల యొక్క చిప్పలు కాల్చి తయారు చేసేది. వీటికే సున్నపు చిప్పలు అని పేరు. ఈ సున్నపు చిప్పలను బట్టీలలో కాల్చి వేడినీటిలో ఉడికించినట్లయితే వెన్నవంటి మెత్తని సున్నము తయారవుతుంది. రాళ్ళనుండి కూడా సున్నమును ఇలా తయారుచేస్తారు. 

సున్నమునుండి మందులు

గాయములకు:

దెబ్బలకు, వాపులకు: తెగిన గాయములు, గుచ్చుకున్న గాయములనుండి స్రవిస్తున్న రక్తమును అరికట్టుటకు మెత్తని సున్నమును వేసి  కట్టుకట్టినట్లయితే నొప్పి తగ్గి గాయము మానుతుంది. 

కవుకు దెబ్బలకు కూడా ఇలాచే చేయాలి.

గజ్జి 

గుల్లసున్నమును గాని, రాతి సున్నమును గాని ఆముదముతో నూరి పైన రాసినట్లయితే గజ్జిపొక్కులు హరిస్తాయి. 

గుండెనొప్పి

మెత్తని సున్నములో నిమ్మపండ్ల రసమును పోసి ఉడికించి అది గుండెకు రాసినట్లయితే శ్లేష్మము కరిగి శ్లేష్మము వలన కలిగిన గుండెనొప్పి హరిస్తుంది. 

శూలలు

ఒక  ఔన్సు సున్నపునీటిని లోనికి త్రాగించిన, తక్షణమే మూడు తమలపాకులను నమిలి మింగించినట్లయితే ప్రబలమైన శూలలు కూడా తగ్గుతాయి.

తీవ్రమైన దగ్గు 

సున్నపురాళ్ళను కాల్చి జిల్లేడుపాలను కలపాలి. ఆ మిశ్రమం చల్లారిన పిదప మెత్తగా నూరి మరల జిల్లేడుపాలతో ఏడు దినములు నానబెట్టి తరువాత బిళ్ళలుగా చేసి నీడలో ఆరబెట్టాలి. తరువాత కొలిమిలో పెట్టి బాగా కాల్చినట్లయితే భస్మం అవుతాయి. దీనిని రెండు లేక మూడు గురివిందగింజల ఎత్తు తమలపాకులో పెట్టి నమిలి మ్రింగించిన దారుణమైన దగ్గుకూడా శమిస్తుంది. 

కాలిన పుండ్లకు

సున్నపునీళ్ళు గ్లాసుడు, ఉమ్మెత్తాకు పసరు అరగ్లాసుడు, కొబ్బరినూనె గ్లాసుడు కలిపి కవ్వముతో చిలికి పలుచని పేస్టులా తయారు చేయాలి. అది పుండ్లమీద రాసినట్లయితే మంట, నొప్పి, సలుపు మొదలైన బాధలు తగ్గిపోతాయి. గాయాలు మానుతాయి. చీము పట్టకుండా ఉంచుతుంది. 

కవుకు దెబ్బలకు

సున్నము-చింతపండు గాని, సున్నము-బెల్లమును గాని కలిపి పట్టువేసినట్లయితే వాపుతీసి బాధ తగ్గుతుంది.

ఒళ్ళు సెగలకు

ఒళ్ళంతా ఆవిర్లు వస్తూ ఉంటే లీటరు మంచినీటిని సలసలా మరగబెట్టి దానిలో నాలుగు చెమ్చాల సున్నం కలిపి దింపి, చల్లారి తేర్చిన తరువాత రెండు చెమ్చాల నీటిలో కొంచెం మంచినీటిని, కొంచెం పంచదారను కలిపి లోపలికి ఇచ్చినట్లయితే సెగలు తగ్గుతాయి. కొందరు పాలను కూడా కలిపి తీసుకుంటారు. 

చలిజ్వరము లేక మలేరియా జ్వరములకు 

చాయపసుపు గుండ, సున్నము సమభాగములుగా కలిపి నీటిని చేర్చి కుంకుడుగింజ పరిమాణములో గోళీలు చేసి రోజుకు రెండుసార్లు ఈ మాత్రలను లోనికి తీసుకున్నట్లయితే ఆహికజ్వరములు, చలిజ్వరములు హరించును. అయిదు దినముల వరకూ ఈ మందు తీసుకోవచ్చు.  

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.