త్రిదోషహారి కరక్కాయ

 

కరక్కాయ గురించి తెలిసిన వారందరూ చిరు చిరు వైద్యాలు చేస్తూనే ఉంటారు. సాధారణంగా కరక్కాయ లేని ఇళ్ళు చాలా తక్కువని చెప్పవచ్చు. కరక్కాయ ఉపయోగాలు ఆయుర్వేద వైద్యంలో అపారమైనవి. కరక్కాయ త్రిదోషహారి. ఇది కూడా త్రిఫలాలలో ఒకటి. అజీర్ణం, మలబద్ధకం, పిత్తసంబంధ వ్యాధులకు కరక్కాయ మంచి మందు. 

ఈ కరక ఏజెన్సీలో విస్తారంగా లభిస్తున్నాయి. 15 మీటర్ల ఎత్తు వరకూ పెరిగే వృక్షమిది. ఈ చెట్టు కాయలతో పాటు బెరడు కూడా ఆయుర్వేదంలో ఉపయోగపడుతోంది. కాంబ్రిటేసి అనే కుటుంబానికి చెందిన ఈ చెట్టును శాస్త్రీయంగా టెర్మినేలియా చెబులా రెట్జెయస్ అని పిలుస్తారు. ఆయుర్వేద వైద్యులు హరీతక అని పిలుస్తారు. 

ఔషధ గుణాలు

  • కరక్కాయల్లో చెబలినిక్ ఆమ్లం, గాలిక్ ఆమ్లం, రసాయనాలతో బాటు విటమిన్-సి కూడా ఉంది. మధుమేహం, రక్తహీనత, కీలక జ్వరాలు, గుండె సంబంధ వ్యాధులు, రక్తపోటు, ప్లీహ వ్యాధుల నివారణకు కరక్కాయను వాడతారు. 
  • కరక్కాయ చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే జ్వయం తగ్గుతుంది. 
  • కరక్కాయ పైపెచ్చులను కాల్చితే ఏర్పడిన మసిని మెత్తగా నూరి ఆ చూర్ణంతో చిగుళ్ళపై రుద్దితే పళ్ళు, చిగుళ్ళు గట్టిపడతాయి. 

ఆయుర్వేదమందులు

కరక్కాయతో అభయమోదక, అభయారిష్టం, అగస్తిహరీటికి, అగ్నితుండీవటి, అమృతహరీతకి, అమలక్యాది చూర్ణం, ఆరోగ్యవర్ధిని, చంద్రప్రభావటి, గోక్షురాది గుగ్గులు, ఖదిరారిష్టం, లఘువిషగర్వతైలం, పునర్నివమండూరం, సంజీవనివటి, సుదర్శనచూర్ణం, త్రిఫలచూర్ణం, దశమూలారిష్టం, పాత్యాదిక్వతం వంటి ఆయుర్వేద మందులోకి కరక్కాయ ఉపయోగపడుతోంది. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.