ఎక్లిప్టా ఆల్ఫా లిన్నేయస్ హస్కార్ల్ అనే శాస్త్రీయనామం కలిగిన ఆస్టరేసి కుటుంబానికి చెందిన భృంగరాజ్ మొక్కను మనం అందరం గుంటకలగరాకు అని పిలుస్తూ ఉంటాం. ఇది అన్ని పంట పొలాలలోను లభిస్తుంది.
ఎందుకు వినియోగిస్తారు?
- ఈ గుంటకలగరాకును కొందరు వంటకాల్లో కూడా వినియోగిస్తారు.
- ఈ గుంటకలగరాకును సిద్ధవైద్యులు భృంగరాజ అని పిలుస్తారు.
- గుంటకలగరాకుతో తయారుచేసే టప్రోలి అనే మందు వైరస్‌ల కారణంగా కలిగే పచ్చకామెర్ల వ్యాధికి మంచి మందుగా పనిచేస్తుంది.
- ఈ మొక్కలోని అన్ని భాగాలు వైద్యానికి పనికివస్తాయి.
- స్టిగ్మోస్టిరాల్ అనే రసాయన పదార్ధం మొక్కలో ఉంది.
- ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే భృగరాజతైలం, సదవిందు తైలం, భృంగరాజాది చూర్ణం, భృంగరాజ ఘృతం, కయ్యాన్యాది తైలం, నీలిభృంగాది తైలం, నారసింహ తైలం, మహత్రిఫలఘృతం వంటి మందులలో మొక్కను వాడతారు.
- భృంగరాజ మొక్కను నేతితో కలిపి నూరి కాలిన గాయాలు మానడంకోసం పూతగా వేస్తారు.
- కఫ, వాత రోగాలకు విరుగుడుగాను, జీవకణాలను శక్తిని ఇవ్వడానికి ఈ మొక్కను వినియోగిస్తారు.
- గర్భస్రావం అవుతుందనే సమయంలో మొక్కను నూరి రసాన్ని ఆవుపాలతో కలిపి పట్టిస్తే గర్భం నిలిచే అవకాశాలు ఉన్నాయి.
- మూర్ఛరోగాలు ఉన్నవారు గుంటకలగర మొక్క రసాన్ని రోజూ ఒక చెంచాడు వంతున సేవిస్తూ ఉంటే క్రమేపీ మూర్ఛ తగ్గుముఖం పడుతుంది.
- మొక్కను నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ పేస్టును బోదకాలుపై పూస్తే వాపు తగ్గుతుంది.
- భృంగరాజ్ మొక్క ఆకులను నువ్వులనూనెతో కలిపి తలకు రాసుకున్నట్లయితే జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు.
- కామెర్లు తగ్గడానికి మొక్క రసాన్ని మిరియాలతో కలిపి తాగిస్తారు.
- మొక్క పొడిని తేనెతో కలిపి తీసుకుంటారు.
- మూత్రసంబంధ వ్యాధులకు కూడా గుంటకలగరాకు అత్యంత ఉపయోగకారి.