గర్భాశయ వ్యాధుల నివారణకు కొడిశపాల వైద్యం

హొలరినా అన్టిడిసెంటిరికా డికన్డోల్ అనే శాస్త్రీయనామం కలిగిన కొడిశపాల అపోసైనేసి కుటుంబానికి చెందినది. ఈ మొక్క రెండు మీటర్ల ఎత్తు వరకూ పెరిగే పొద లేదా చిన్న వృక్షం. గిల్లితే పాలు వస్తాయి. పత్రాలు కణుపుకు రెండు చొప్పున దాదాపు దీర్ఘఅండాకారంలో ఉంటాయి. పుష్పాలు తెల్లగా, సువాసనతో ఉండి పత్రగ్రీవాల నుంచి ఏర్పడతాయి. ఫలాలు సన్నగా, పొడవుగా జంటలుగా ఏర్పడతాయి. విత్తనాలకు దూది ఉంటంది. 

పుష్పాలు, ఫలాలు: పుష్పాలు ఏప్రిల్-జూలై మాసాలలోను, విత్తనాలు డిసెంబరు-మార్చి మాసాల మధ్యలో లభిస్తాయి. 

లభించే ప్రదేశాలు: ఈ మొక్క తెలుగురాష్ట్రాల్లోని అన్ని అరణ్యాలలో పెరుగుతుంది. 

ఉపయోగపడే భాగాలు: ఈ మొక్క బెరడు, పత్రాలు, వేర్లు, విత్తనాలను వైద్యపరంగా ఉపయోగిస్తారు. 

రసాయనపదార్ధాలు: ఈమొక్కలో కుర్చిన్, హలారైనిన్, కొనిసైన్, కొనిసిమైన్, ఐసోకొనిసమైన్ వంటి అనేక రసాయన పదార్ధాలు ఉంటాయి. 

ఉపయోగాలు

ఈ మొక్క బెరడులో ఉండే కొనిసైన్ అనే ఆల్కలాయిడ్ జిగట విరోచనాలను కలిగించే ప్రొటోజోవా జీవులను నిర్మూలించే శక్తి ఉంది.  

ఈ మొక్కనుంచి తయారుచేసే ‘కుటజాష్టకం’ ను వాడితే కడుపులోని నులిపాములు, ఏలికపాములు పడిపోతాయి. 

గంగాధరచూర్ణాన్ని వాడితే నీళ్ళవిరేచనాలు, జిగట విరోచనాలు తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. 

ప్రదరారిలేహం ను స్త్రీలు వాడితే  గర్భాశయ దోషాలు తగ్గిపోతాయి. 

మూలశంఖ, చర్మవ్యాధులు, గుండెజబ్బులు, జ్వర నివారిణిగా త్రిదోషహరంగా బెరడు పనిచేస్తుంది. 

విత్తనాలు రక్తం స్రవించే మూలశంఖ, కడుపునొప్పి, విషానికి విరుగుడు గాను, లైంగిక శక్తి పెంచడానికి, మూత్రాశయం లోని రాళ్ళను కరిగించడానికి, ఆస్థ్మా, బ్రాంఖైటిస్, పెరిగిన కాలేయం, ప్లీహంను సరిదిద్దడంలోను ఉపయోగపడతాయి. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.