స్థూలకాయం తగ్గాలంటే....



శరీరంలో పేరుకుపోయిన కొవ్వుతో చాలామంది బాధపడుతున్నారు ఈ రోజుల్లో. ఇది శరీరంలో అంతటా కాక కడుపు, పుష్పభాగాల్లోనే అధికంగా కొవ్వు పేరుకుపోయి మనిషి చూడడానికి వికారంగా కనిపించడం, నడకకు ఆటంకం కలిగిస్తుండడం, ఆయాసంతో రొప్పడం వంటివి సంభవిస్తూ ఉంటాయి.

దీనికి పరిష్కారంగా వ్యాయామం చేయాలని ఎందరో సలహాఇచ్చినా పొట్ట తగ్గించుకోవడానికి చాలారకాల కష్టాలు పడుతూ ఉంటారు. అలా నిలువచేసిన కొవ్వు రక్తప్రసరణకు ఆటంకం కలిగించి ఇతర జబ్బులరాకడకు కూడా కారణమవుతుంది. వ్యాయామం చేయడానికి ప్రతినిత్యమూ అందరికీ సమయమూ, ఓపికా ఉండకపోవచ్చు. దీంతో కాలాన్ని దాటవేస్తూ ఉంటారు. దీనికి పరిష్కారంగా ఈ విధానం ఎంతో ప్రశస్తనీయంగా ఉంటుంది.

మందు తయారీ


చిత్రమూలపట్ట చూర్ణం, సజ్జాక్షరం, వెలిగారం, దాల్చినచెక్క, నువ్వులు, సైంధవలవణం, మిరియాలు, జీలకర్ర, సునాముఖి లను అన్నింటినీ మూడేసి తులాల ఎత్తు వంతున ఒక బౌల్ లో తీసుకుని వాటిని అన్నింటినీ కలిపాలి. ఈ మందును ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి.

వాడే విధానం


ప్రతిరోజూ ఉదయం, సాయంకాలం వేడినీటిలో ఒక చెంచా వంతున ఈ మందును కలుపుకుని సేవిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఒక నెలరోజుల్లో పూర్తిగా ఫలితం కనిపిస్తుంది.

స్థూలకాయానికి మరోమందు


సజ్జాక్షారం రెండు తులాలు, త్రికటుకాలు మూడు తులాలు, త్రిఫలచూర్ణం మూడు తులాలు, వెలిగారం, పటిక, సైంధవలవణం మూడు తులాలు, దాల్చినచెక్క తులం, వాము తులం, యింగువ అర తులం, సూరేకారం ఒక తులం వీటన్నింటినీ ఆరబెట్టి సీసాలో వేసి ఉంచుకోవాలి.

వాడే విధానం


అరకప్పు వేడినీటిలో మూడు చెమ్చాల తేనె కలిపి, పైన తయారుచేసిన చూర్ణాన్ని ఒక చెమ్చా చేర్చి పరగడుపున తీసుకోవాలి. రెండు నెలల పాటు ఇలా వాడితే ఎంతలావైనా మాయమవుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.