తలతిరగడం, ఒక పక్క తలపోటు, వాంతుల నివారణకోసం



పైత్యం పెరిగి, రక్తపోటు పెరిగి, రక్తంలో లవణశాతం పెరిగినా, తగ్గినా ముందుగా తల గిర్రున తిప్పడం మొదలై లేచి నిలబడలేని స్థితి కలుగుతుంది. నిద్రలేమివల్ల, ఉపవాసాలవల్ల, ఎండలో చాలాసేపు తిండిలేకుండా శ్రమించడం వంటి వాటివల్ల కూడా తల తిరగడం వంటివి జరుగుతాయి. అయితే వీటిని తాత్కాలిక ఇబ్బందులుగా భావించి వెంటనే సరైన ఆహారపానీయాలు అందించి తగ్గించవచ్చు.

అయితే రక్తపోటు కారణంగా వచ్చిన తలతిరుగుడు తగ్గాలంటే ఆహారంలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా జాగ్రత్తవహించాలి. ముందుగా ఒకసారి విరేచనం ఔషధం తీసుకుని ఆ తర్వాత ఈ క్రింది విధానాన్ని అనుసరించి పథ్యం చేస్తూ మూడు నుంచి నాలుగురోజుల పాటు ఉదయం, రాత్రి వేళ్ళల్లో గోరువెచ్చని నీటితో ఒక చెమ్చా చూర్ణం వాడుకోవాలి. ముఖం బాగా కడుక్కోవడం, కడుపు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి నిండా తినాల్సుంటుంది. పచ్చిమిరప, సెనగపిండి, నూనె, మాంసాహారాలను వినియోగించకూడదు. ఉప్పుకు బదులు సైంధవలవణాన్ని ఉప్పు వాడినట్టుగానే ఆహారంలో వినియోగించాలి.

చూర్ణం తయారుచేసే విధానం ఇలా...


అశ్వగంధ, త్రికటుకాలు, దాల్చినచెక్క, జీలకర్ర, ధనియాలు, వాము, సోంపు, ఏలకులు, తాళిసపత్రి, జాజికాయలు రెండు, కుంకుమపూవు, నువ్వులు, వెలిగారం, సైంధవలవణం, సుగంధపాల వేర్లు మొత్తం కలిపి చూర్ణంలా చేసుకోవాలి. తడిలేడుండా ఒక సీసాలో నిల్వచేసి ఉంచుకోవాలి.

ఇంగువను కొద్ది వేడినీటిలో వేసి నానబెడితే తెల్లగా పాలలాంటి ద్రవం తయారవుతుంది. ఈ ద్రవాన్ని తలలో ఏపక్క నొప్పి ఉంటుందో ఆ పక్క ముక్కులో అరచెమ్చా వేయాలి. రెండు దినాల పాటు ఇలా చేస్తే ఒకపక్క పార్శ్వపునొప్పి మాయమవుతుంది.

పార్శ్వపునొప్పికి మరో మందు


అరటిపండు ముక్కకు రంధ్రంచేసి బఠానీ గింజంత యింగువముక్కను అందులో కూరి నమలకుండా మింగేయాలి. ఇలా ఉదయాన్నే నొప్పి మొదలైనా, అవకపోయినా తప్పనిసరిగా తీసుకోవాలి. పరగడుపున కొందరికి అరటిపండు సహించకపోయినట్లయితే మెత్తటి బెల్లంముక్క లోపల ఇంగువపెట్టి మింగాలి. మళ్ళీ మిట్ట మధ్యాహ్నం ఒకసారి మింగాలి. ఇలా వారంరోజులపాటు వాడితే జీవితంలో మళ్ళీఏనాడూ ఈ ఇబ్బంది దరిచేరదు. ఇలాంటి సమస్య ఉన్నవారు శీతలపానీయాలు తాగకూడదు.

దీనికి కూడా లొంగని నొప్పయితే కింది విధానం అనుసరించాలి. నొప్పి మొదలైన వెంటనే భృకుటి స్థానంలో, ఏవైపు నొప్పి ఉంటుందో ఆ కనుబొమ్మ పక్కన చిన్న తిలకం పెట్టాలి. దీనికి కావలసిన పదార్ధాలు తమలపాకు వేసుకునే సున్నం శనగగింజంత తీసుకుని అందులో అంతే ప్రమాణంలో బట్టలు ఉతికే సబ్బుముక్క కలిపి, తయారైన గుజ్జులాంటి ఆ గంధాన్ని అగ్గిపుల్లతో చిన్నగా ఒకేచోట గట్టిగా అంటించాలి. బాధ ఉన్నచోట నరం ఉబ్బుగా కొట్టుకుంటుంది.

సరిగ్గా ఆ నరాన్ని గుర్తించి కళ్ళలో పడకుండా ఆ నరంమీద అతికించి ఆరబెట్టుకోవాలి. తెల్లారేలోగా అక్కడ నీరు, పొడమిపోటు శాశ్వతంగా తగ్గుతుంది. అవసరమైతే వారం తరువాత ఇంకోసారి ఈ మందు వాడవచ్చు. దీనితోపాటు శీతలపానీయాలు తాగడం, అధికంగా పప్పు తినడం, కారం ఎక్కువగా తినడం, వర్షంలో తడవడం, నిద్రలేమి వంటివి లేకుండా చూసుకోవాలి. రతిలో పాల్గొనకూడదు. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.