ఆస్టరేసి కుటుంబానికి చెందిన గుంట గలగరాకు శాస్త్రీయనామం ఎక్లిప్లా ఆల్బా(లిన్నెయస్) హస్కార్ల్ . నీరు, తేమ ఉన్న ప్రదేశాలలో నిటారుగా లేదా నేలబారున పెరిగే చిన్న ఏకవార్షికపు మొక్క. మొక్క అంతటా నూగు ఉంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దాదాపు కుంభకటకాకారంలో ఉంటాయి. పుష్పాలు చిన్నవిగా, తెల్లగా ఉండి పొడవైన కాడచివర ఏర్పడతాయి. ఫలాలు నల్లగా ఉంటాయి.
పుష్పాలు, ఫలాలు అక్టోబరు నుంచి మార్చి మాసాల మధ్యలో లభిస్తాయి. ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా పంటపొలాలలోను, చెరువులు, కాలువల గట్లవెంబడి కలుపుమొక్కగా పెరుగుతుంది.
గుంటగలగరాకు ఉపయోగాలు
గుంటగలగరాకు ఈ మొక్కను సమూలంగా వైద్యపరంగా వాడతారు. స్టిగ్మోస్టిరాల్ వంటి రసాయనాలు ఇందులో ఉన్నాయి.