పొడపత్రి ఉపయోగాలు
ఈ మొక్క పత్రాలు, వేర్లు, విత్తనాలు వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలో హెంట్రియా కంటేన్, ట్రైట్రయా కంటేన్, జిమ్మ్నిమిక్ ఆమ్లం, జిమ్నమైన్ వంటి రసాయన పదార్ధాలుంటాయి. ఈ మొక్క పత్రాలను నమిలిన తర్వాత తీసి వస్తువులను తింటే చప్పగా ఉంటాయి. వేరును పొడపాము కాటుకు విరుగుడుగా వాడతారు. కరచిన చోట దీని పొడిని చల్లుతారు.మూడు నెలలు వరుసగా పత్రాల చూర్ణం తీసుకుంటే అతిమూత్రవ్యాధి తగ్గుతుంది. పత్రాల కషాయం, జ్వరం, దగ్గును తగ్గిస్తుంది. పత్రాలను ఆముదంతో కాచి, దానిని ఉబ్బిన గ్రంధులపై పూస్తే తగ్గుతాయి. వేరు పత్రాలను విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఉపయోగిస్తారు. కడుపునొప్పిని తగ్గిస్తాయి. మూత్రాన్ని జారీచేస్తాయి. శరీరానికి శక్తినిస్తాయి. చలువచేస్తాయి.
ఫలాలను ఆకలిని పుట్టించడానికి లెప్రసి, బ్రాంఖైటిస్, కడుపులో క్రిములు, అల్సర్ లు, మూత్ర సంబంధ వ్యాధుల నివారణలో వాడతారు. పత్రాలు కండ్లవ్యాధులు, గుండెజబ్బులు, కామెర్లు, మూలశంఖ, మూత్రాశయంలో రాళ్ళు వంటి వాటిలో ఉపయోగిస్తాయి.
ఆయుర్వేద మందులల్లో పొడపత్రి: వరునాదికషాయం, వరునాదిఘృతం, మహాకల్యాణకఘృతం, అయస్కృతి వంటి మందుల తయారీలో పొడపత్రి ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.