శ్వాశకోశ వ్యాధుల చికిత్సలో ‘ఏడాకులపాల’


అపోసైనేసి కుటుంబానికి చెందిన ఏడాకులపాల శాస్త్రీయనామం ఆల్ స్టోనియా స్కాలరిస్(లిన్నెయస్) రాబర్ట్ బ్రౌన్. ఏడాకులపాల ఐదు నుంచి 25 మీటర్ల వరకూ ఎత్తు పెరిగే వృక్షం. కణుపునుండి నాలుగు నుంచి తొమ్మిది వరకూ పత్రాలు వస్తాయి. సాధారణంగా ఏడు పత్రాలుంటాయి. పత్రాలు దళసరిగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి,దీర్ఘవృత్తాకారంలో గాని, మొదలు సన్నగా ఉండి చివర కొంచెం వెడల్పుగా ఉంటాయి. మొక్క యొక్క భాగాలను గిచ్చితే పాలు వస్తాయి. పుష్పాలు కొమ్మల చివర చిన్న గుత్తులుగా ఏర్పడతాయి. పుష్పాలు తెల్లగా లేదా లేత ఆకుపచ్చగా ఉంటాయి. ఫలాలు జంటలుగా ఏర్పడతాయి. విత్తనాలకు దూది ఉంటుంది.  పుష్పాలు ఫిబ్రవరి మాసంలోను, ఫలాలు నవంబరు మాసంలోను ఏర్పడతాయి.  ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ లోని దట్టమైన అరణ్యాలలో మాత్రమే పెరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి, పాతకోట, మంగంపాడు తదితర ప్రాంతాలలో అక్కడక్కడా పెరుగుతుంది.

మొక్కలో ఉపయోగాలు

ఈ మొక్క కాండం, బెరడు, పత్రాలు, పాలను వైద్యపరంగా ఉపయోగిస్తారు.  ఈ మొక్క బెరడులో ఎఖిటమైన్, వెనోటర్పైన్, పత్రాలలో పిక్రినైన్, పిక్రాలినాల్, స్కాలిలైన్ వంటి అనేక రసాయన పదార్ధాలున్నాయి.  మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగించే ‘ఆయుష్-64’ అనే ఆయుర్వేద మందు తయారీలో ఈ మొక్క బెరడు కలుస్తుంది.

బెరడు శ్వాసకోశ, జ్వర, క్రిమి, చర్మరోగహరము. విరోచనాలను అరికడుతుంది. కీళ్ళనొప్పులు తగ్గుతాయి. లైంగికశక్తిని పెంచుతుంది. కఫాన్ని వెడలగొడుతుంది. బెరడుకు దీర్ఘకాలిక నీళ్ళవిరేచనాలు, జిగట విరేచనాలు అరికట్టే శక్తి ఉంది. పాలను అల్సర్లు, కీళ్ళనొప్పుల నివారణకు కొబ్బరినూనెలో కలిపి పైనపూయాలి. చెవిపోటు తగ్గడానికి చెవిలో రెండుచుక్కలు పోయాలి. పాముకాటుకు విరుగుడుగా పాలు పనిచేస్తాయి.

బెరడుకు కేన్సర్ ను తగ్గించే గుణం ఉంది. చర్మవ్యాధులను నివారిస్తుంది. బెరడు మరియు వావిలిమొక్క పత్రాలను కలిపి గుజ్జుగా తయారు చేసి దానిని కీళ్ళ నొప్పులున్న చోట పూస్తే అవి తగ్గుతాయి. బెరడునుండి తీసిన పాలు క్షయ ను తగ్గిస్తాయి. పాలను నీటితో కలిపి వాడితే దగ్గు, గనేరియా తగ్గుతాయి. ఇంకా కలరా, బ్రాంఖైటిస్, ఆస్థమా, తలపోటు, కీళ్ళనొప్పులు, న్యుమోనియా, ఎముకలు అతుక్కోవడం వంటి వాటిలో ఉపయోగిస్తారు.

పది గ్రాముల బెరడు పొడిని మిరియాలపొడితో కలిపి తీసుకుంటే కీళ్ళనొప్పులు పోతాయి. దీని బెరడు, వావిలిపత్రాలను సమంగా కలిపి నీటితో మరగబెట్టి వచ్చిన కషాయాన్ని కీళ్ళనొప్పులున్న భాగాలపై పూస్తే తగ్గుతాయి. బెరడుపొడిని, పాలతో కలిపి తీసుకుంటే కుష్ఠువ్యాధి నయమవుతుంది. బెరడు కషాయాన్ని కానుపు సమయంలో తీసుకుంటే బాధలు తగ్గుతాయి. బెరడు కషాయాన్ని బాలింతలు తీసుకుంటే పాలు ఎక్కువ అవుతాయి.  మూత్రంలో ఫాస్ఫేటులు పోతుంటే బెరడు కషాయాన్ని లోనికి తీసుకోవాలి. పుష్పాలపొడిని లేదా బెరడు రసాన్ని కొద్దిగా పిప్పళ్ళు, తేనెతో కలిపి తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

ఆయుర్వేద మందుల్లో ఏడాకులపాలు:  సప్తచ్చాదాదిక్వతం, సప్తచ్చాదాదాతైలం, సప్వవర్ణ ఘనాస్టవ, అమృతాష్టక పాచన తదిత మందుల్లో ఏడాకులపాటను వినియోగిస్తారని వైద్యలు చెబుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.