పాముకాటుకు విరుగుడు ఊడుగ


అలాంజియేసి కుటుంబానికి చెందిన ‘ఊడుగ’ శాస్త్రీయనామం అలాంజియం సాల్వి ఫోలియమ్ (లిన్నెయస్ ఫిలియన్) వేంగర్డ్.  రెండు నుంచి మూడు మీటర్లు ఎత్తువరకూ చిన్నపొదగాని లేదా వృక్షంగా గాని పెరుగుతుంది. చిన్న శాఖలు కొన్ని దృఢమైన ముండ్ల మాదిరిగా మారతాయి. పత్రాల కణుపుకు ఒకటి చొప్పున ఏర్పడి, దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. పత్రాల అడుగుభాగంలో నూగు ఉంటుంది. పుష్పాలు తెల్లగా, సువాసన కలిగి ఉంటాయి. పత్రాలు రాలిపోయిన తర్వాత పుష్పాలు కణుపువద్ద ఏర్పడతాయి. ఫలాలు కోలగా ఉండి ఎండినప్పుడు ఊదా రంగులో గాని, నల్లగా గాని ఉంటాయి. దీని
ఫలాలు, పుష్పాలు ఏప్రిల్ నుండి జూలై వరకు ఏర్పడతాయి.  ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా అరణ్యప్రాంతాలలో ముఖ్యంగా కొండల దిగువ భాగంలోను, కంచెలలోను, బీడు భూములలోను పెరుగుతుంది.

ఊడుగలో ఉపయోగపడే భాగాలు

ఈ మొక్క వేరు బెరడు, విత్తనాలను వైద్యపరంగా ఉపయోగిస్తారు. త్రిదోషహరి...  ఈ మొక్కలో మార్కిడైన్, మార్కైన్, ట్యూబులోసిన్, సెఫాలిన్, అంకోరిన్ వంటి రసాయన పదార్ధాలు ఉంటాయి.
వేరు మలబద్ధక నివారణలోను, కడుపులోని క్రిముల నివారణలోను, ఫలాను శరీరానికి చలువచేయడానికి, శక్తినివ్వడానికి ఉపయోగిస్తారు. ఫలాలను కండ్ల వ్యాధుల నివారణలోను, ప్లీహ వ్యాధుల్లోను, కడుపునొప్పి, శూల, భగంధరం, కలరా, బ్రాంఖైటిస్, పాముకాటుకు విరుగుడుగాను వాడుతారు.

వేరుబెరడు పొడిని పాము కరిచిన ప్రదేశంలో అద్దితే విరుగుడుగా పనిచేస్తుంది. వేరు పేస్టును చర్మవ్యాధుల నివారణకు పైపూతగా వాడతారు. వేరు బెరడుకు అధిక రక్తపోటును తగ్గించే గుణం ఉంది. పిచ్చికుక్క కాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. కుష్ఠు, సిఫిలిస్, జ్వరాలు, విరోచనాలు, కఫ నివారణలోను, రక్తస్రావాలలోను వాడతారు. వేరును మిరియాలతో కలిపి నీటితో తీసుకుంటే పిచ్చికుక్క కాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. లేదా వేరు కషాయాన్ని, నేతితో తీసుకోవచ్చు. ఫలాలను తింటే కండ్ల వ్యాధులు రావు. పత్రాలను నూరి కీళ్ళ నొప్పులున్న భాగంపై పట్టువేస్తే తగ్గుతాయి. బెరడు రసాన్ని తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గుతుంది.  అంకోలతైలం, మహాభూతిర్వఘృతం వంటి ఆయుర్వేద మందుల్లో ఉడుగ ను వాడుతున్నట్టు వైద్యలు చెబుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.