జూలై నుంచి అక్టోబరు మాసాలలో పుష్పాలు, ఫలాలు లభిస్తాయి. దుంప సెప్టెంబరు నుంచి నవంబరు మాసాలలో దొరుకుతుంది. ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అరణ్యాలలో తేమ ఉండే ప్రదేశాలలో పెరుగుతుంది.
కేపుకిన్నె ఉపయోగాలు
వేరుకు గర్భనిరోధక శక్తి ఉంది. జ్వరాలు, దగ్గు, అజీర్ణం, కడుపులోని క్రిములు, చర్మవ్యాధులు, పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. వేరు పొడిని వాడితే మూత్రంలో రక్తంపోవడం తగ్గుతుంది. కీళ్ళనొప్పులు, ఆస్థమా, బ్రాంఖైటిస్, కలరా, మూత్రంలో మంట, చెవిపోటు తగ్గుతాయి. వేడిచేసిన కాండం రసాన్ని చెవిలో పోస్తే చెవిపోటు తగ్గుతుంది. వేరు గుండెకు బలాన్నిస్తుంది. కఫ, పిత్త వ్యాధులను నివారిస్తుంది. మధుమేహం, వంటికి నీరు పట్టడం, కుష్ఠు, రక్తవ్యాధులు నివారణ అవుతాయి. వేరు రసాన్ని నుదురుకు పూస్తే తలపోటు తగ్గుతుంది.
వేరును పంచదారతో తీసుకుంటే కడుపులోని క్రిములు నశిస్తాయి. వేరు కామెర్లవ్యాధిని నివారిస్తుంది. వేరు కషాయాన్ని తుంగముస్తలు, వేపబెరడుల కషాయంతో కలిపి తీసుకుంటే కుష్ఠువ్యాధి నివారణ అవుతుంది. వేరు రసాన్ని వస కొమ్ముతో అరగదీసి, ఆ గంధాన్ని బొల్చిమచ్చలపై పూస్తే క్రమక్రమంగా తగ్గిపోతాయి.
ఆయుర్వేద మందులల్లో కేపుకిన్నె: ఏలాదితైలం, మంజిష్టాది తైలం, మంజిష్టాది చూర్ణం, బలధాత్రియాదితైలం, అవన మంజిష్టాది తైలం వంటి ఆయుర్వేద మందుల్లో కేపుకిన్నె వినియోగిస్తారని వైద్యులు తెలుపుతున్నారు.