మునగ చెట్టు బెరడు, వేర్లు, ఆకులు, విత్తనాలు, పువ్వులు అన్నీ చాలా దేశాల సాంప్రదాయక వైద్యవిధానాలలో ఉపయోగంలో ఉన్నాయి. జమైకా లో దీని కాండం నుండి నీలపు వర్ణకం తయారుచేస్తారు.
మునగ పువ్వులు పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ లో బాగా ఇష్టపడే రుచికరమైన ఆహారం. అక్కడ దీనిని sojne ful అని పిలుస్తారు. వీటిని పచ్చి శెనగలు మరియు బంగాళాదుంపలతో కలిపి వండుతారు.
మునగాకు, కాయలు తల్లిపాల వృద్ధికి తోడ్పడతాయి. ఒక టేబుల్‌స్పూను మునగాకు పొడిలో 14% మాంసకృత్తులు, 40% కాల్షియం, 23% ఇనుము చాలావరకు విటమిను ఎ లభిస్తాయి. ఆరు చెంచాల పొడి గనుక తింటే గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు కావలసిన ఇనుము, కాల్షియం లభిస్తాయి.
మునగాకు ప్రతి 100 గ్రాముల్లో
- నీరు-75.9% కాల్షియం-440 మి.గ్రా.
- మాంసకృత్తులు-6.7% పాస్ఫరస్-70 మి.గ్రా.
- కొవ్వుపదార్థాలు-1.7% ఇనుము-7 మి.గ్రా.
- పీచుపదార్థం -0.9% ‘సి’ విటమిను-220 మి.గ్రా.
- ఖనిజలవణాలు-2.3% కొద్దిగా ‘బి’ కాంప్లెక్సు
- పిండిపదార్థాలు-12.57% కాలరీలు-92
అటువంటి మునగను మనం ఒక రక్తహీనతకే కాకుండా వేరే జబ్బులకు కూడా ఉపయోగించవచ్చు.
మునగ ఉపయోగాలు
ఆకుల రసాన్ని పాలతో కలిపి పిల్లకు ఇస్తే ఎముకలు బలపడతాయి. వంట్లోకి రక్తం పడుతుంది. గర్భసంచిని సరయిన స్థితిలో ఉంచి, కాన్పు సులభంగా అయ్యేలా చేస్తుంది. కాన్పు తర్వాత ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. పాలిచ్చే తల్లులకు కూరగా వండిపెడితే పాలు వృద్ధి చెందుతాయి. కోస్తా ప్రాంతంలో బాలింతలకు తెలగపిండి (నువ్వుల నుంచి నూనె తీయగా మిగిలిన కేకు) మునగాకు వండి తినిపించడం సాంప్రదాయంగా వస్తుంది.
గుప్పెడు మునగాకులు ఆకులు 80 మి.లీ. నీటితో 5 నిమిషాలు మరగనిచ్చి, చల్లారనివ్వాలి. దానికి కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టిబి, మామూలు దగ్గుని తగ్గించొచ్చు.
మునగాకు పెన్సిలిన్ యాంటిబయోటిక్‌లా సూక్ష్మజీవుల్ని నివారిస్తుంది. మునగాకు, పువ్వులతో చేసిన సూప్ తాగడం వల్ల గొంతునొప్పి, చర్మవ్యాధులు నివారించవచ్చు.
ఒక చెంచా తాజా రసానికి తేనె, గ్లాసు కొబ్బరినీళ్లు కలిపి రోజుకు మూడుసార్లు ఇస్తే కలరా, జిగట విరేచనాలు, నీళ్ల విరేచనాలు, పచ్చకామెర్లకు ఉపశమనం కలుగుతుంది. విటమిన్ ఎ, సి, సున్నము, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి.
పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు.అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. సి విటమిన్ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు, తగ్గవు. వంద గ్రాముల ఆకుల్లో కాల్సియం - 440 మిల్లీ గ్రాములు, ఇనుము- 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి. వేరు క్రిమిసంహారిగాను, గనేరియా, సిఫిలిస్ వ్యాధులకు మంచి చికిత్స. ఆకులు, బెరడు, వాత, కంటి సమస్యలకు మంచి మందు.
పాడి పశువులకు ఆకులు బలవర్ధకం. పాల ఉత్పత్తి 43-60 వరకు పెరుగుతుంది. మునగ మాను నుండి జిగురు పదార్థం లభిస్తుంది. వస్త్ర, తోలు పరిశ్రమలలోను, సౌందర్య సాధనలోను దీన్ని విరివిగా వాడుతారు. ఇలా వద్దు చాలా మంది మునగ కాయ గుజ్జును మాత్రమే గోటితో తీసి తింటారు. చెక్క వదిలేస్తారు. ఇలా చేస్తే అందులోని పూర్తి పోష కాలు అందనట్టే. చెక్కను నమిలి సారాన్ని కూడా తీసుకోవాలి.
సౌందర్యపోషణలో మునగ
తాజా ఆకులరసం, నిమ్మరసం కలిపి రాస్తే మొటిమలు, బ్లాక్‌హెడ్స్ పోయి ముఖం తాజాగా ఉంటుంది. ఇన్ని ఉపయోగాలున్న మునగాకు ఇంకా మార్కెట్లో అమ్మే ఆకుకూరగా మారలేదు. చెట్ల మీద ఉచితంగా కోసుకోవచ్చు. వెంటనే దీన్ని ఉపయోగించి రక్తహీనత నుండి కోలుకోవడమే కాకుండా బలమైన ఎముకలు కలిగిన ఆరోగ్యవంతులుగా తయారవ్వండి. ఆలస్యం చేయకండి.