‘మెంతికూర’తో గుండెకు బలం



మనం ఆహారంలో ఉపయోగించే మసాలా దినుసుల్లో మెంతులు ఒకటి.  ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను పులుసు, పోపులోనూ వాడుతుంటాం. అలాగే మెంతి ఆకులు ఆకుకూరగా కూడా ఉపయోగిస్తారు. అలాంటి మెంతులలో అనేక ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలీదు. అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో మధుమేహ వ్యాధి నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయని తెలిపారు. మెంతులు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం!

మెంతికూర ఆకులు గుండెకు, పేగులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ‌పైత్యం అధికంగా ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, తేనె కలిపి తీసుకుంటే త్వరగా నయమవుతుంది. ‌మెంతిఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే బాగా నిద్రపడుతుంది. ‌మెంతి ఆకులను దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. జుట్టు మెరిసేందుకు సహాయపడుతుంది ‌కిడ్నీ, మూత్రనాళ సంబంధిత సమస్యలకు మెంతులు చక్కని మందు. రక్తనాళాలను, శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మెంతికూర రోజూ మన ఆహారంతో పాటు తీసుకుంటే, మన ఆరోగ్యానికి చాలా మంచిది.

మెంతి ఆకులను మెత్తగాదంచి పేస్ట్‌గా చేసి ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు తగ్గుతాయి. మెంతి ఆకులను దంచి నీటిలో కలిపి పుక్కిలిస్తే, గొంతులో మంట తగ్గిపోతుంది. మెంతి ఆకులను జ్యూస్ చేసి నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధులు తగ్గుతాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.