‘బచ్చలికూర’ తింటే చలువ చేస్తుంది


బచ్చలికూర ఆకులు చాలా దళసరిగా, ముదురు ఆకుపచ్చ రంగులో, మందంగా ఉంటాయి. అందువలన ఇతర ఆకుకూరల కన్నా వీటిని ఎక్కువగా నిల్వ ఉంచగల సామర్థ్యం ఉంటుంది. బచ్చలి చాలా రకాలుగా ఉంటుంది. గుబురుగా, పొట్టిగా పెరిగే దానిని దుబ్చు బచ్చలి లేక మెట్ట బచ్చలి అంటారు. తీగలుగా పాకే బచ్చలిని తీగబచ్చలి అంటారు.

ఆకారంలోను, రుచిలోను ఇవి రెండూ దాదాపు ఒకేవిధంగా ఉంటాయి. ఇవి కాకుండా ఎర్ర బచ్చలి, పాల బచ్చలి, పెద్దబచ్చలి అనే రకాలూ ఉన్నాయి. విటమిన్‌ -ఎ(బీటా కెరోటిన్‌), విటమిన్‌-సి, విటమిన్‌-కె, విటమిన్‌-బి6, ఫోలేట్‌, రిబోఫ్లోవిన్‌ కూడా బచ్చలిలో ఉంటాయి. బచ్చలి చలువ చేయు గుణాన్ని కలిగి ఉంటుంది. బచ్చలిలో ఇనుము అత్యధికంగా ఉంటుంది. అందువలన బచ్చలికూరను రోజూ తీసుకుంటే రక్తహీనత నశించి, రక్తపుష్టి కలుగుతుంది.

బచ్చలి సూప్‌ తీసుకుంటే అపసవ్యమైన రుతుక్రమం, రుతుదోషాలను నివారించవచ్చు. గర్భిణీలు బచ్చలి సూప్‌ను ప్రతిరోజూ తీసుకుంటే గర్బస్రావాన్ని నిరోధించవచ్చు. బచ్చలిలో ఉండే ఫోలెట్‌ గర్భిణీలకు, గర్భాన్ని కోరుకునే స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది.

బచ్చలికూరలో ప్రోటీన్లు ఎక్కువ. ప్రోటీన్లను అత్యధికంగా శరీరం గ్రహించేలా చేయడానికి బచ్చలికూర అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో క్యాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. కొలెస్ట్రాల్‌ను బచ్చలి కూర తగ్గిస్తుంది. అన్నిరకాల దీర్ఘకాలిక వ్యాధులలోకెల్లా కంటి వ్యాధులను అదుపు చేయడంలో బచ్చలికూర బాగా ఉపయోగపడుతుంది. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో కలిసి బచ్చలికూర తీసుకున్నట్లైతే వయస్సుతో వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అలాగే నిమ్మకాయ యాంటి ఆసిడ్. నాలుక మీద ఆమ్లాలు, శరీరంలో క్షారాలు ఊరడానికి దోహదం చేస్తుంది. నీటిలో, తేనెలో లేదా అలాగే నిమ్మరసం తీసుకుంటే బరువు తగ్గుతారు. తీసుకునే ఆహారంలోనూ నిమ్మరసం కాసింత కలిపితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.  ఆహారం ద్వారా లభించే ఐరన్, కాల్షియం శరీరం గ్రహించడానికి విటమిన్ సి ఎంతగానో దోహదం చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును తగ్గించడంలో నిమ్మ బాగా పనిచేస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.