ఉమ్మెత్త ఉపయోగాలు
ఈ మొక్క ప్రతాలు, వేర్లు, ఫలాలు, పత్రాలు, పుష్పాలను వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలో హయోసయోమిన్, హయోసైన్, అట్రోపైన్, స్కొపాలమైన్, నికోటినమైన్ వంటి అనేక రసాయనాలు ఉంటాయి. పత్రాలను విషానికి విరుగుడుగాను, చెవిపోటు, అల్సర్ లు, వాపులు తగ్గడానికి వాడతారు. విత్తనాలను విరోచనాలు, జ్వర నివారణలోను, మూలశంఖ, లైంగిక పటుత్వానికి వాడతారు.
వేర్లు పన్నుపోటును తగ్గిస్తాయి. విత్తనాలు ఆస్థ మా, పిచ్చికుక్క కాటు, మలేరియా జ్వర నివారణలోను, పత్రాల పొగను పీల్చితే దగ్గు తగ్గుతుంది. తలపోటు, గవదబిళ్ళలు, పిచ్చి, కీళ్ళనొప్పులు, మూర్ఛ, వరిబీజం, సిఫిలస్ వంటి వ్యాధుల నివారణలో వాడతారు. జీర్ణశక్తిని పెంచుతుంది. దురదలు, చిడుము, కుష్ఠు, చుండ్రు వంటి చర్మవ్యాధులు నివారణ అవుతాయి.
పత్రాల పొడిని పసుపు పొడితో కలిపి పేస్టుగా చేసి వాపులపైన పూస్తే నొప్పి, వాపు తగ్గుతాయి. పత్రాలరసం పాలు, బెల్లం, నెయ్యిని సమపాళ్ళలో తీసుకొని లోనికి తీసుకుంటే పిచ్చికుక్కకాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. పత్రాలను తిప్పతీగపత్రాలు, సున్నం, బెల్లంలతో నూరి గోయిటర్ పై పూస్తే తగ్గుతుంది. నాలుగు విత్తనాలు కొద్దిగా నెయ్యితో నూరి లోనికి తీసుకుంటే అన్నిరకాల మానసిక వ్యాధులు నివారింపబడతాయి. విత్తనాలను నూరి, దీనిని పిప్పిపన్ను గళకలో పెడితే, పిప్పిపన్నుపోటు పోతుంది.
ఆయుర్వేద మందుల్లో ఉమ్మెత్త : కనకాసవం, దుగ్ధవిటి, లఘువిషగర్వతైలం, కనకతైలం, మృతసంజీవిని, దతుర్ ఫల్ వస్మ, దతురాది ప్రలేపం, దుర్ధురాదితైలం, స్వల్ప జ్వరాంకుశరసం.