‘ఉల్లి’ చేసిన మేలు తల్లి కూడా చేయదు


సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడా ఇదే ప్రజాతికి చెందినది. ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతికి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. ఉల్లిపాయను సంస్కృతంలో పలాండు అని, హిందీలో ప్యాజ్‌ అని, ఇంగ్లీషులో ఆనియన్‌ అని అంటారు. తెలుగులో దీనిని ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ అంటాము. నిజానికి దీనిని నీరుల్లిపాయ అనడం సరైనది. నీటి వసతి ఉన్న ప్రదేశాలన్నింటిలోనూ, వర్ష రుతువులోనూ దీనిని సాగు చేస్తారు. దీనికి విత్తనాలుగా దుంపలను, గింజలను కూడా వాడవచ్చు. దీని ఆకులు సన్నగా, పొడవుగా ఉంటాయి. ఆకుల మధ్యలో ఒక కాండం ఉండి, దాని చివర పూలగుత్తి ఏర్పడుతుంది. అందులోనే గింజలు ఏర్పడుతాయి. ప్రతి మొక్కకు భూమిలో ఒకటినుంచి మూడు వరకూ దుంపలు ఏర్పడుతాయి. ఉల్లి చేసే మేలు తల్లి కుడా చేయదనే సామెత ఉన్నది .

ఉల్లి పాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి . ఇది ఆసియాలో పుట్టిందని కొందరంటే ... పాకిస్తాన్ లో పుట్టిందని కొందరంటారు. ఇప్పుడు అన్ని దేశాల్లో ఉల్లి పండుతుంది . ఎన్నో హార్మోన్ల గుణాలు ఉల్లి రసంలో ఉన్నాయి. టేస్తోస్తేరాన్ (testosteron), ఇన్సులిన్ (insulin), గ్రౌత్ హార్మోన్ (GrowthHormone, ఆక్షితోసిక్ (Oxytocic) వంటి లక్షణాలు ఉన్నాయి., పచ్చి ఉల్లి ఎక్కువగా తింటే గుండె మంట (Acidity) వస్తుంది . దీనిలో గంధకం పాలు ఎక్కువగా ఉంటుంది కావున కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తాయి . ఉల్లిలో కేలరీలు శక్తి ఎక్కువ .. వేయిస్తే ఈ శక్తి విలువ ఇంకా పెరుగుతుంది . ఉల్లిని అన్ని కూరలలోలో వాడుతారు . విందు భోజనాల్లో ఉల్లి పెరుగు చట్ని తప్పని సరిగా ఉంటుంది .

వైద్య పరంగా ఉల్లి ఉపయోగాలు


తెల్ల ఉల్లిపాయ రసాన్ని నాలుగు నుండి ఆరు టీస్పూన్ల మోతాదులో రోజుకు రెండు లేదా మూడుసార్లు వాడితే శరీరం లోపల జరిగే అంతర్గత రక్తస్రావాలు తగ్గుతాయి. తెల్ల ఉల్లిపాయ ముక్కలను మజ్జిగలో కలుపుకొని తాగుతూ ఉన్నా చక్కని గుణం కనిపిస్తుంది. నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసానికి ఒక చిటికెడు పొంగించిన ఇంగువ పొడిని, ఒక చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజుకు అవసరాన్నిబట్టి రెండూ లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే పొట్ట ఉబ్బరింపు, పొట్ట నొప్పి, గ్యాస్ తగ్గుతాయి.
ఉల్లి రసానికి తగినంత తేనె కలిపి కంట్లో చుక్కల మందుగా వేసుకుంటూ ఉంటే కంటి చూపు పెరుగుతుంది.

ఒకటి నుండి రెండు టీస్పూన్ల ఉల్లిపాయ రసానికి రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని, చిటికెడు ఉప్పును కలిపి అవసరాన్ని బట్టి రెండు లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే కడుపునొప్పి తగ్గుతుంది. ఒకటి నుండి రెండు ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌కు కలిపి తింటే ఆమాశయం, జీర్ణ అవయవాలు శక్తివంతం అవుతాయి.

రెండు నుండి నాలుగు టీస్పూన్ల ఉల్లిపాయ రసాన్ని రోజుకు మూడు లేదా నాలుగుసార్లు మూడు నెలలపాటు తాగితే మూత్రపిండాల నొప్పి, పొత్తికడుపులో నొప్పి, పేగులలో పురుగులు, మూత్ర వ్యవస్థలో రాళ్లు తయారవటం వంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. ఒకటి లేదా రెండు తెల్ల ఉల్లిపాయలను చిన్నగా తరిగి నీళ్లలోవేసి మరిగించి తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది.

ఉల్లిపాయ రసాన్ని, సున్నం నీళ్లను సమభాగాలుగా కలిపి పూటకు రెండు టీస్పూన్ల వంతున మూడు పూటలా తాగితే కలరాలో నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.
25 గ్రాముల ఉల్లిపాయ ముక్కలను, 6 మిరియం గింజలను మెత్తగా దంచి గుడ్డలో వేసి రసం పిండండి. దీనిని ఎంత వీలైతే అంత తాగండి. అవసరం అనుకుంటే దీనికి పటికబెల్లం పొడిని కలపవచ్చు. దీంతో ప్రాణ ప్రమాదాన్ని కలిగించే కలరా లక్షణాలు తగ్గుతాయి. అసాధ్యమైన కలరా వ్యాధిలో రోగి మగతగా పడుకొని నీళ్లు కూడా తాగలేని స్థితిలో ఉన్నప్పుడు 250 మిల్లీగ్రాముల కర్పూరం పొడిని నోట్లో వేసి వెంటనే 2 టీస్పూన్ల ఉల్లిపాయ రసాన్ని పోయండి. దీంతో ఎంతటి తీవ్రమైన కలరా వ్యాధిలోనైనా ఫలితం కనిపిస్తుంది.

ప్రతి 10 లేదా 15 నిమిషాలకు ఒకసారి ఉల్లిపాయ రసాన్ని తాగగలిగినంత రోగి చేత తాగిస్తూ ఉంటే కలరా వ్యాధి ఉపశమిస్తుంది. ఒక టీస్పూన్ ఉల్లిపాయ రసం, ఒక టీస్పూన్ ఆవునెయ్యి, అర టీస్పూన్ తేనెలను కలిపి ఉదయం, సాయంకాలం చప్పరిస్తూ రాత్రిపూట పాలు తాగుతూ ఉంటే సిఫిలిస్ వ్యాధి, మూత్రాధిక్యత అతి మైధునంతో ఏర్పడిన నపుంసకత తదితర సమస్యలు అన్నీ తగ్గుతాయి.
ఉల్లిరసాన్ని, నెయ్యిని సమభాగాలుగా కలిపి దీనిని ఒక టీస్పూన్ మోతాదుగా మూడుపూటలా తీసుకోండి. దీనితో శారీరక బలహీనత దూరమవుతుంది.

ఉల్లిపాయను మెత్తని గుజ్జుగా నూరి మొలల మీద, జారిన మలాశయం మీద లేపనంగా పూసుకుంటే మొలల్లోని వాపు, దురద, నొప్పి తగ్గుతాయి. మండే నిప్పు కణికల మీద రెండు ఉల్లిపాయలను వేయించి పైపొట్టు తీసి లోపలి పాయలను నూరి ముద్దగా చేసి మలద్వారం చుట్టూ తయారైన చీముగడ్డల మీద కట్టుకోండి. దీనితో వెంటనే పైల్స్‌లో వాపు, దురద, మలద్వారంలో నొప్పి వంటివి తగ్గుతాయి.
125 మి.లీ. ఉల్లిరసానికి నాలుగు టీస్పూన్ల పటికబెల్లం పొడిని కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండండి. ఇది రక్తస్రావంతో కూడిన మూలవ్యాధిలో అమోఘంగా పనిచేస్తుంది. దీంతో రక్తస్రావం త్వరితగతిన ఆగుతుంది. పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది.

ఉల్లిపాయ ఒక యాంటీబయాటిక్. దీనిని తిననవసరంలేదు... మన పక్కన ఉంచుకుంటే చాలు వైరస్, బాక్టీరియాల వలన వచ్చే జబ్బులను మన దగ్గరకు రానివ్వదు. వచ్చిన జబ్బులను కూడా నయంచేస్తుంది . 1919 లో ఫ్లూ జ్వరం వచ్చి 40 మిల్లియన్ల ప్రజలు చనిపోయారు. గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారని తెలుసుకున్న ఒక డాక్టర్ అక్కడున్న ప్రజలను కాపాడాలని నిర్ణయించుకుని గ్రామాలకు వెళ్లేడు. ఆయన వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రజలలో చాలామందికి ఈ జబ్బు వచ్చి చనిపోయారు. అయితే ఒక గ్రామంలో ఒక కుటుంబం మొత్తం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటం చూసిన డాక్టర్ ఆశ్చర్యపడి "ఇది ఎలా సాధ్య పడింది" అని ఆ కుటుంబీకులను అడిగేరు. అక్కడున్న ఒక రైతు భార్య "ఇదుగో దీని వలన" అంటూ ఒక పెచ్చుతీయని ఉల్లిపాయను చూపించింది. "ఉల్లిపాయలను ఒక గిన్నెలో ఉంచి ప్రతి రూములోనూ ఉంచేము...ఇది మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతోంది" అని చెప్పింది. డాక్టర్ వారి దగ్గరున్న ఉల్లిపాయను తీసుకుని తన మైక్రోస్కోప్ లో చూసేడు. ఆ ఉల్లిపాయ నిండా ఆ ఫ్లూ వైరస్ ఉంది.

ఉల్లిపాయలలో బ్యాక్టీరియాలకూ, వైరస్ లకూ కావలసిన మాగ్నెట్ ఉంది. ఆ మాగ్నెట్ ఆకర్షణ వలన బ్యాక్టీరియాలూ, వైరస్ లు ఉల్లిపాయలోకి వెడతాయి. వెళ్ళిన తరువాత ఆ ఉల్లిగాటుకు అవి చనిపోతాయి. ఆ చనిపోయిన బ్యక్టీరియా మరియూ వైరస్ లు వలన ఉల్లిపాయ నల్లబడుతుంది. బ్యాక్టీరియాతో గానీ, వైరస్ తోగానీ జబ్బుపడి బాధ పడుతున్నవారు పెచ్చు తీయని ఉల్లిపాయను రెండు ముక్కలుగా తరిగి, ఆ రెండు ముక్కలనూ తలో గిన్నెలో ఉంచి తమ దగ్గర పెట్టుకుంటే ఆ జబ్బు పడ్డవారిలో ఉన్న బ్యాక్టీరియానో, వైరసో ఆ ఉల్లి ఆకర్షణకు బయటకు వచ్హి ఉల్లిలో జేరిపోతాయి. జబ్బు పడ్డ వారిలో బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి కనుక వారికి జబ్బు నయం అవుతుంది.

ఒకసారి తరిగిన ఉల్లిపాయను మిగిలిపోయింది కదా నని మరుసటిరోజు వాడకండి. ఎందుకంటే ఆ ఉల్లిపాయలో గాలిలో ఉన్న బ్యాక్టీరియాలు జేరి ఉంటాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.