బొమ్మలమర్రి ఉపయోగాలు
ఈ మొక్క వేర్లు, పత్రాలు వైద్యపరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్క వేర్లలో సెపోజెనిన్, ట్రైటర్పిన్, స్టిగ్మోస్టిరాల్, సపోనిన్, డి-మానిటాల్ వంటి రసాయనాలుంటాయి. వేరు కషాయాన్ని ఆస్థమా(బ్రాంఖైటిస్), శ్వాసకోశ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. పాముకాటు, జ్వర నివారణలో వాడతారు. ఈ మొక్క వేర్లను ఆకలిని పెంచడానికి, జ్వరం, కీళ్ళనొప్పులు, భగంధరం, కలరా, పార్శ్వ పక్షవాతం తగ్గడానికి వాడతారు. కఫం వల్ల వచ్చే అన్నిరకాల శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. కఫాన్ని వెడలగొడుతుంది. దగ్గు, పడిశం, మూర్ఛ, కడుపులోని క్రిములు పోవడానికి, కండ్లవ్యాధులు వంటివి నివారణ అవుతాయి. వేరు పేస్టును బార్లీనీటిలో కలిపి వృషణాలపై వ్యాస్తే వరిబీజం తగ్గుతుంది.
ఆయుర్వేద మందుల్లో బొమ్మలమర్రి : భారంగిగుడ, బారంగాదిక్వతం, కనకాసవం, సుదర్శనచూర్ణం, శృంగవాది చూర్ణం, యోగరాజగుగ్గులు, భారంగాది కషాయం వంటి మందుల్లో బొమ్మల మర్రి ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు.