అగ్గితో కాపడము- కడుపు నొప్పికి అద్భుత చికిత్స


రోగిని వెల్లకిలా పడుకోబెట్టి, కడుపమీద నాలుగైదు పొరలుగా గుడ్డ పరచి, ఇత్తడిచెంబులో కణకణలాడే నిప్పులు పోసి ఆ చెంబుతో, ప్రమాదము కలగకుండా ఆ గుడ్డమీద కాపడము పెడతారు. కడుపు ఉబ్బరము, కడుపునొప్పులకు ఇది మంచి చికిత్స అని పెద్దలు చెప్తారు.

ఈ చికిత్స వలన ఆమము కరిగిపోయి విరేచనము అవుతుంది. అంతేకాక గర్భవాతము, కడుపునొప్పి, కఫప్రకోపము తగ్గిపోతాయి. ఆకలిపుడుతుంది. అయితే ఈ చికిత్సను తరచుగా చేయకూడదు. అతిగా చేస్తే నేత్రసంబంధ రోగములు వచ్చే ప్రమాదం ఉంటుంది. పైత్యము ప్రకోపించవచ్చు.

పసిపిల్లలకు కడుపుఉబ్బరము, కడుపునొప్పి, మలమూత్రములు బంధించిన సందర్భాల్లో తల్లులు వారిని కాళ్ళమీద వెలకిలా పడుకోబెట్టుకుని, తమ అరచేతులు నిప్పులపై కాచుకుని, వేడివేడి చేతులతో ఆ పిల్లల కడుపుకు కాపడము పెట్టాలి. దీనివల్ల బాధలు ఉపశమిస్తాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.