అడవి దమనము గుణములు
వగరు, చేదు కలిసిన రుచి కలిగి ఉండును. చలువచేసే స్వభావము కలది. విపాకమున కారపురుచి కలిగి ఉంటుంది. మూడు దోషములను హరిస్తుంది. జంతు విషమును, కృత్రిమ విషములను గూడ హరించును. రక్తము వలన కలుగు వికారములను, దురదలు, కుష్ఠు రోగములను హరించును. వీర్యమును బంధించి సంభోగశక్తిని కలిగించును.అగ్నిదమనము వేడిచేయును. వాత కఫములను, గుల్మములను పోగొట్టును. హృదయమునకు మంచి బలమును ప్రసాదించును.