అక్రోటు లేదా వాల్ నట్ గింజలు కొంచెం తీపిగాను, కొంచెం పుల్లగాను ఉంటాయి. అయితే ఇవి వేడిచేసే స్వభావము కలిగి ఉంటాయి. రుచిని పుట్టిస్తాయి. వాతముతో కలిగి ఉన్న పైత్యము, వాతము ప్రధానముగా ఉండే క్షయవ్యాధి, గుండె సంబంధ వ్యాధులు, రక్తంలో దోషాలు, రక్తములో ఉన్న పైత్యము పోగొడుతుంది. ముసలివాళ్ళకు శరీరపటుత్వము కలుగచేసి ఉత్సాహవంతులుగా ఉండేలా చేస్తాయి.
కఫము, పైత్యమును కలుగచేస్తాయి. శరీరమునకు బలమును కలిగిస్తాయి. మలబద్ధకము కలిగిస్తాయి. దీనికి విరుగుడుగా ద్రాక్షరసముగాని, పుల్లదానిమ్మ పండ్ల రసముగాని, నిమ్మరసంగాని, మాదీఫల రసముగాని త్రాగవలెను.