అటుకమామిడి తీగ జాతికి చెందిన రకం దీనిని నాడిక అని కూడా పిలుస్తారు. Spreading Hog-weed విభాగానికి చెంది
Boerhavia diffusa అనే అంగ్ల నామం కలిగిన ఈ మొక్క గలిజేరు తెగలోనిది. సన్నని తీగలతో భూమిమీద రెండు మూడు గజాల వరకూ పాకుతుంది. ఈ మొక్క అన్నిచోట్లా విస్తారముగా పెరుగుతుంది. ఆకులు గుండ్రముగా చిన్నవిగా పావలాకాసు సైజులో ఉంటాయి.
అటుకమామిడి మూడు రకాలుగా మనకు కనిపిస్తుంటుంది. ఎరుపు, తెలుపు, నీలము రంగులు ఉన్న ఈ తీగను పువ్వులను చూసి గుర్తుపట్టవచ్చు. రంగునుబట్టి దీనికి ప్రత్యేక ఉపయోగము, శక్తి ఉంటుంది. ఆయుర్వేదంలో అటుకు మామిడి కీలకమైన మూలికగా చెప్పవచ్చు.
అటుకమామిడి లక్షణాలు
నల్లపూవులు గల తీగ వేడిచేస్తుంది. రుచి కారము, చిరుచేదు కలిగి ఉంటుంది. రసాయనకర్మలకు శ్రేష్ఠమైనది వాత, కఫములను, శ్వాస, పాండురోగము, ఉబ్బును హరిస్తుంది. ఎర్రపూవులు గల తీగ చలువచేస్తుంది. విపాకమున కారపు రుచిగా మారుతుంది. ఎఱ్ఱకుసుమలకు పెట్టిందిపేరు. కంటికి కలికము వేసినచో స్త్రీసంగమ దోషములను హరిస్తుంది.
అటుకమామిడి ఉపయోగాలు
తెల్లపూవులు గల తీగ వేడిచేస్తుంది. చేదు, వగరు కలిసిన రుచి కలిగి ఉంటుంది. కడుపులో బల్లలు, వాతము, కడుపునొప్పి తదితర ఉదర వ్యాధులకు దీని ఆకు కూరవండి తింటారు. వేరు రసము వాంతిని చేయును. నీరుడు ఆగినప్పుడు దీని కషాయము ఇచ్చినట్లయితే నీరుడు అవుతుంది. మాండూభస్మము దీని కషాయముతో పాటు ఇచ్చినట్లయితే దారుణమైన ఉబ్బులు కూడా తగ్గుతాయి. ఈ మూలికను ఏ విధముగా సేవించినా సరే చప్పిడి పత్యము అవసరము.