నీళ్ల విరెచనాలను అరికట్టే అడవి జీలకర్ర


అడవి జీలకర్ర ను సంస్కృతంలో వనజీరక అని కూడా పిలుస్తారు. మొక్కతెగలోనిది, శాస్త్రీయంగా Cuminum Cyminum అని పిలుస్తారు. ఇది Wild Cummin Seeds గా కూడా ప్రాచుర్యం పొందింది.

దీనిని అడవిజీలకర్ర అని, విషకంట్రకాలని పిలుస్తారు. కొందరు నల్లజీలకర్ర అని కూడా అంటారు. కారము, వగరు కలిసిన రుచి కలిగి ఉంటుంది. వేడిచేసే స్వభావము కలది. విపాకమున కారపురుచి కలిగి ఉంటుంది.  ఒక అడుగు పెరుగుతుంది. నూగు కలిగిన ఆకులు ఉంటాయి.

దీని ప్రయోగములు

గుఱ్ఱములకు వచ్చే జబ్బులకు దీనిని విస్తారముగా వినియోగిస్తారు. అన్ని వ్రణములను మాన్పుతుంది. చిడుము పొక్కులను హరిస్తుంది. స్తంభవాతము, కంఠగత శ్లేష్మమును తగ్గిస్తుంది. దీనిగింజల మసి వేడినీళ్ళలో కలిపి త్రాగితే శూలలు హరిస్తాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.