సంస్కృతంలో దీనిని ‘వనకటిల్లక’ అని పిలుస్తారు-Green Fruit of Momordica Cherantia గా ఆంగ్లంలో పిలిచే ఈ అడవి కాకర ఒక wild variety అని చెప్పాలి. అటవీ ప్రాంతంలో పెరిగే ఔషద మొక్క. సాధారణంగా అడవి కాకర అంటే నిత్యం మనం వినియోగించే అకాకర అని కొందరు చెబుతుంటారు. కానీ ఇది అడవిలో పెరిగే భిన్నమైన పాదు. కూర కాకర కంటే కొంచెం పొట్టిగా ఉంటాయి.
అందుకే గిరిజనులు దీనిని దీనిని పొట్టికాకర అని కూడా అంటారు. ఆకులు మామూలు కాకరకంటె చిన్నవిగా ఉంటాయి. పువ్వులు పసుపుపచ్చగా ఉంటాయి. పువ్వుకు నాలుగు రేకులు మాత్రమే ఉంటాయి.
గుణములు: కాయలు మిక్కిలి చేదుగా ఉంటాయి. ఎండ బాగా తగిలినచో చేదు కొంచెం తగ్గుతుంది. వేడిచేస్తాయి. కఫమును హరిస్తాయి. విపాకమున కారపురుచి కలిగి ఉంటాయి. పాండు, కామలారోగములను హరిస్తాయి.
ఇలా వినియోగించాలి
ఆకులు ఎండెబెట్టి చూర్ణము చేసి పులుసు కాచుకుని తింటే నులిపురుగులు నశిస్తాయి. విరేచనము చేయును. మశూచి రాకుండా ఉంటుంది. దీని కాయలు ముక్కలుగా చేసి ఎండలోపెట్టి వేపుడు చేసుకుని అన్నముతో తింటే మంచి పథ్యకారి. ఆకురసముతో బంగారపు రేకులు నూరి పుటములు వేసినచో సూర్యోదయము వలె ఎర్రగా భస్మమవుతుంది. లోహజాతులన్నీ కూడా దీనితో భస్మమవుతాయి.