ఈ రబ్బరు పట్టీ పెట్టుకుంటే మీలో మధుమేహం తగ్గిపోతుంది


మధుమేహం మనిషి వెన్నంటి వేటాడే భయంకర పిశాచి లాంటిది. మందులు మింగి అదుపులో ఉంచుకోవడం తప్ప వైద్య శాస్త్రం కూడా నివారణ కనుగొన లేకపోయింది. మనిషిలో ఈ వ్యాధి ప్రవేశించిందంటే క్రమేపీ కృంగ దీస్తుంది, శరీరాన్ని జల్లెడలా తయారు చేస్తుంది. అయితే ఇప్పడు ఇంక మధుమేహం వ్యాధిగ్రస్తులు అసలు భయపడనక్కరలేదంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు.

మీరు ఒక స్మార్టు బ్యాండు ధరిస్తే చాలు, మీలోని కొవ్వు కరిగిపోవడంతో పాటు మీ బ్లడ్ గ్లూకోజ్ స్థాయి పూర్తిగా అదుపులోకి వచ్చేస్తుందని చెబుతున్నారు... అందేంటో చూద్దామా...

జపాన్ శాస్త్రవేత్తల అద్భుత  సృష్టిది...

జపాన్ దేశంలోని కుమామోటో యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు మరో అద్భుతాన్ని సృష్టించారు. వాళ్ళు ఒక వాచీ వంటి దాన్ని కనిపెట్టారు. అంటే ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న ఫిట్ నెస్ ట్రాకర్ వంటిదన్నమాట. ఈ స్మార్ట్ గాడ్జెట్ రెండో రకం మధుమేహం(టైప్ 2 డయాబెటిక్) వ్యాధికి చికిత్స చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది చేతికి ధరించినప్పుడు దీనిద్వారా ఉత్పన్నమయ్యే తరంగాలు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతోపాటు రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను సమతౌల్యంగా ఉంచుతాయి. చేతికి ధరించే బెల్టు ఆకారంలో ఉండే ఈ

ఒక ప్రత్యేకమైన రబ్బరుతో తయారుచేయబడి ఉంటుంది. ఈ రబ్బరు సున్నితంగా స్పృశించే విద్యుత్ తరంగాలను ఉత్పత్తి చేస్తుంది.

అవి శరీరాన్ని ప్రేరేపిస్తూ అంటే వైబ్రేషన్ కలిగిస్తూ కొవ్వును కరగదీస్తాయి. అలాగే హీట్ షాక్ ప్రొటీన్ 72(హెచ్ఎస్ పి72) ను ఉత్పత్తి చేసి గ్లూకోజ్ లెవెల్స్ ను సాధారణ స్థాయిలో ఉంచుతుంది. ప్రస్తుతం ఈ పరికరం ఆవిష్కరణ స్థాయిలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది.

అసలు మధుమేహ వ్యాధి అంటే ఏమిటి?


మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం మరియు రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత .

మూత్రవిసర్జన ఎక్కువగా చేయడం, దాహం ఎక్కువగా వేయడం, మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం మరియు బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత దేశం, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోఅత్యధికంగా ఈ వ్యాధి ప్రబలి ఉన్నది . ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన మూడు డయాబెటిస్ మెల్లిటస్ రకాలేంటంటే... డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1(1వ రకం), డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 2(2వ రకం), ఇంకా జెస్టేషనల్ డయాబెటిస్ (గర్భిణీలలో వచ్చే డయాబెటిస్). అయితే ఈ మూడు రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే.

మొదటి రకం డయాబెటిస్ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశనం చేయడం (ఆటోఇమ్యూనిటీ) వల్ల కలుగుతుంది. రెండవ రకం డయాబెటిస్‌లో ఇన్సులిన్ నిరోధకత వస్తుంది. దీనివల్ల అధికంగా ఇన్సులిన్ కావలసి వస్తుంది, బీటా కణాలు ఈ డిమాండ్ తట్టుకోలేనప్పుడు డయాబెటిస్ కలుగుతుంది. జెస్టేషనల్ డయాబెటిస్‌లో కూడా ఇన్సులిన్ నిరోధకత అగుపిస్తుంది.

జెస్టేషనల్ డయాబెటిస్ సర్వసాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది, కానీ మొదటి రకం, రెండవ రకం మధుమేహాలు మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయి. 1921లో ఇన్సులిన్ అందుబాటులోకి రావడంతో అన్ని రకాలను నియంత్రించడం సాధ్యమయ్యింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.