మన ఆరోగ్యాన్ని కాపాడు కోవడానికి మన ఇంటి వైద్యాలు చూద్దాం.
పిస్తా పప్పు తినే వారికి వయస్సులో చర్మంలో వచ్చే ముడతలు త్వరగా రావు. పిస్తా పప్పులో అతి తక్కువ క్యాలరీలు, తక్కువ కొవ్వు ఉంటాయి. అధిక పీచు పదార్ధలు ఉండడం వల్ల గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. క్యాన్సర్ రాకుండా చేస్తుంది.
శొంఠి 100 గ్రాములు, వాము 100 గ్రాములు, 50 గ్రాముల సైంధవ లవణం(ఉప్పు) తీసుకుని మూడింటినీ దోరగా వేయించాలి. వాటిని దంచి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు పూటలా ఆహారం తిన్న తర్వాత పావు చెంచా నుంచి అర చెంచా వరకూ నోటిలో వేసుకుని మంచినీరు తాగితే తిన్న ఆహారం చాలా సులభంగా జీర్ణం అవుతుంది. జీర్ణ సంబంధ వ్యాధులు పోతాయి.
ఆవు వెన్న, నువ్వుల పొడి సమాన భాగాలుగా తీసుకుని మూడు పూటలా తింటుంటే మొలలు కరిగిపోతాయి.
కరక్కాయ పొడి 5 గ్రాములు, పంచదార 10 గ్రాములు, ఆవునెయ్యి 10 గ్రాములు కలిపి రెండు పూటలా తింటుంటే క్రమంగా పైత్యం హరిస్తుంది. నోట్లో నీరు ఊరటం తగ్గిపోతుంది.
తోటకూర రసాన్ని రెండు నుంచి మూడు చెంచాలు పిల్లలు తీసుకుంటూ ఉంటే ఆకలి పెరిగి రక్తం వృద్ధి అవుతుంది.
గోరువెచ్చని దేశవాళీ ఆవునెయ్యి నాలుగేసి చుక్కల వంతున రెండు పూటలా రెండు ముక్కుల్లోను వేస్తుంటే పార్శ్వపు తలనొప్పి పది రోజుల్లోనే పారిపోతుంది.
ఒక కప్పు పాలల్లో ఒక చెంచాడు నెయ్యి, చెంచాడు పటికిబెల్లం పొడి కలిపి తాగితే పైత్యం నివారించబడుతుంది.
ఉదర రోగాలకు గోధుమ రొట్టె మంచి మందు. పావుసేరు గోధుమపిండిలో వంట ఆముదం 50 గ్రాములు కలిపి, బాగా పిసికి, నిప్పుల పైన రొట్టెలా చేసుకుని నెయ్యి రాసి పంచదార అద్ది తినండి. ఇలా నాలుగైదు రోజులు చేస్తే ఉదర వ్యాధులన్నీ పోతాయి. గ్యాస్ బాధ కూడా తగ్గుతుంది.
ఒళ్ళుమంటలకు పెరుగు మంచిది. ఆవు పెరుగును ఓ పలుచటి గుడ్డలో పోసి నీరంతా కిందకి దిగాక పిండి, గట్టిగా ఉన్న పదార్ధాన్ని శరీరంపై రాసుకుంటే మంటలు తగ్గిపోతాయి.
నారింజ రసం ప్రతిరోజూ ఓ గ్లాసుడు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఒళ్ళుమంటలకు పెరుగు మంచిది. ఆవు పెరుగును ఓ పలుచటి గుడ్డలో పోసి నీరంతా కిందకి దిగాక పిండి, గట్టిగా ఉన్న పదార్ధాన్ని శరీరంపై రాసుకుంటే మంటలు తగ్గిపోతాయి.
నారింజ రసం ప్రతిరోజూ ఓ గ్లాసుడు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
గర్భిణీ స్త్రీలు పచ్చి తోటకూర రసం తీసుకుంటుంటే కాళ్ళ వాపులు రావు. శరీరం తేలికగా ఉంటుంది.
పుచ్చకాయ తింటే మూత్ర విసర్జన సులభంగా జరుగుతుంది. స్థూలకాయాన్ని తగ్గిస్తుంది.
నువ్వుల పొడి, వరిపిండి, వాము సమభాగాల్లో తీసుకుని వేయించి నిల్వ చేసుకుని పూటకు పది గ్రాముల మోతాదులో రెండు, మూడు పూటలు సేవిస్తే అతిమూత్ర వ్యాధి నివారణ అవుతుంది.
టమాటా రసం తీసుకోవడం వల్ల క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాలేయాన్ని, రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణశక్తి పెంచుతుంది.
కళ్ళు మండుతూ ఉన్నట్టయితే తాజా ఆవు వెన్నను కళ్ళ చుట్టూ సున్నితంగా రాసి మర్దన చేస్తే నరాల్లో రక్త ప్రసరణ జరిగి మంటలు తగ్గుతాయి.
గోరువెచ్చని గంజిలో రెండు చెంచాల నెయ్యి కలిపి రోజూ రెండు మూడు పూటలూ తీసుకుంటే అతి వేడి హరించిపోతుంది.
లోపలి జ్వరానికి ఆవు వెన్న, పటికబెల్లం పొడి కలిపి తింటే జ్వరం తగ్గిపోతుంది.