దోమలకు శతృవు తీగపల్లేరు




సెలాస్ట్రస్ పానిక్యులాటస్ విల్డినో అనే శాస్త్రీయ నామం కలిగి సెలాస్టేసి కుటుంబానికి చెందిన పాదు లేదా పొద ఇది. దీనిని వాడుక భాషలో తీగపల్లేరు అని పిలుస్తారు. దీనికే మల్కంగిణి, మలేరియా తీగ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణాల్లో అన్ని అడవుల్లోను వృక్షాలపైకి పొదలా ఆవరించి పెరిగే ఈ పాదు వల్ల మనిషికి ఎన్నో ఉపయోగాలున్నాయి.

ఈ చెట్టు దోమలకు శతృవని, దీని ఫలసాయం నుండి తీసే నూనెను దోమలు కుట్టకుండా ఒంటికి రాసుకుంటారు. ఈ మొక్కనుండి లభించే ఆకులు, విత్తనాలు వైద్యానికి పనికివస్తాయి. వైద్యానికి ఈ మొక్కనుండి లభించే నూనె ఎక్కువగా ఉపయోగపడుతుంది.

నూనెలో లవంగాలు, జాజికాయ, జాపత్రిలతో కలిపి తీసుకుంటే చెరి-చెరి వ్యాధి నివారణ అవుతుంది. నూనె తలకు పట్టిస్తే జుత్తు ఒత్తుగా పెరుగుతుంది. నూనె రెండు చుక్కలను పాలలో కలిపి తాగితే నరాల బలహీనతలు తొలగుతాయి.

అలాగే తమలపాకుపై ఈ నూనె రాసి రాత్రి సమయంలో తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.మొక్క నూనెకు ఆకలి పుట్టించే శక్తి, ఆస్థమా, మలబద్ధకం, జ్వరాలను తొలగించే శక్తి ఉంది.

ఈ పొద జ్యోతిష్మతి తైలం, జ్యోతిష్మతి కల్పం, కరంజాది యోగం, లఘుషగర్వ తైలం వంటి ఆయుర్వేద మందులకు వాడతారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.