ఆయుర్వేద వైద్యంలో విషానికి విరుగుడుగా ఉపయోగిస్తారు. మొక్క దుంప, వేర్ల మొదలైన భాగాల్లో సుర్పైన్, గోరియోసైన్, కాల్బిసిన్ వంటి రసాయనాలు ఉన్నాయి.
మొక్క వేరు రసాన్ని పాము, తేలు, జెర్రి వంటి విష కీటకాలు కరిచినప్పుడు విరుగుడుగా వాడతారు. మేకులు, సూదులు, ముళ్ళు వంటివి గుచ్చుకోవడం ద్వారా కలిగిన గాయాలకు రసం పైపూతగా వాడవచ్చు. పేలు పోవాలంటే ఆకుల నుండి తీసిన రసం తలకు పట్టించాలి. వేర్లను కీళ్ళ నొప్పులు, సిఫిలిస్, మూలశంఖ వంటి వ్యాధుల నివారణకు వాడతారు.
రసాయనం, లఘువిషగర్వతైలం, జ్యోతిష్మతాది తైలం, మహాభు ఆర్వఘృత వంటి ఆయుర్వేద మందులలో దీనిని ఉపయోగిస్తారు. శాస్త్రీయంగా గ్లోరియోసా సుపర్బా, లిన్నేయస్ అని పిలిచే ఈ మొక్క లిలియేసి కుటుంబానికి చెందినది.