స్త్రీ వ్యాధులకు ఆరె పువ్వు వైద్యం


ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అంతటా లభించే ఆరెపువ్వు లేదా జాజుకు పువ్వు అనే మొక్క ఆయుర్వేదంలో స్త్రీ ఋతుసంబంధ వ్యాధులకు వాడుతున్నారు.

నీటి సదుపాయం గల ప్రాంతాల్లోను, కాలువలు, ఏటిగట్ల వెంబడి మొలిచే ఈ మొక్కను ఫుడ్ పోర్థియో ఫ్రూటికోసా (లిన్నేయస్) కుర్జ్ అని పిలుస్తారు. లైత్రేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను వైద్యపరంగా ధాతకి అని పిలుస్తారు. విరోచనాలు, జీర్ణాశయ రోగాలు, కాలేయ వ్యాధులు నివారణకు ఆయుర్వేద ఔషధాలలో ఈ మొక్క ఉపయోగపడుతోంది.

అభయారిష్టం, కుటజారిష్టం ఖదిరారిష్టం, అశోకారిష్టం, కనకాసవం, పిప్పలాసవం, లఘుగంగాధర చూర్ణం, ధాతక్యాది చూర్ణం, ధాతక్యాది తైలం వంటి ఆయుర్వేద మందులలో ఈ మొక్క పువ్వులను, పత్రాలను ఉపయోగిస్తున్నారు. మొక్క పువ్వు ఎక్కువగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగపడుతోంది. ఉడ్ ఫోర్డిన్స్ , ఎ, బి, సి, బిటీసైటోస్టిరాల్ లినోలిక్, పామిటిక్, స్టియారిక్ ఆమ్లాలు, ఇనోసిటాల్ వంటి రసాయన పదార్ధాలు పుష్పాల్లో ఉన్నట్లు కనుగొన్నారు. పుష్పాలను పొడిచేసి పాలు, పంచదారతో కలిపి తింటే స్త్రీలలో ఋతు సంబంధ వ్యాధులు నివారణ అవుతాయి.

గర్భస్రావం కాకుండా కూడా ఉపయోగపడుతుంది. ఆకులతో కషాయం తయారుచేసి అల్లపురసం, పంచదారలతో కలిపి పిత్త సంబంధ రోగాలకు మందుగా వాడవచ్చు.

రక్తమొలలు కూడా తొలగుతాయి. రక్త శుద్ధి, జీర్ణాశయ వ్యాధులు, కాలేయ వ్యాధుల పాలిట ఈ మొక్క పుష్పాలు అత్యంత ఉపయోగకారులు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.