హేమికాడెస్ మస్ ఇండికస్ (లిన్నేయస్ రాబర్ట్ బౌన్) అనే శాస్త్రీయనామం కలిగి ఆస్క్లిపియడేసి కుటుంబానికి చెందిన సుగంధిపాల మొక్క టాన్సిల్స్ నివారణకు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగపడుతోంది. అరణ్యప్రాంతాల్లో,బీడుభూముల్లో, పంటపొలాల గట్ల వెంబడి విస్తారంగా లభించే ఈ మొక్కను సారివరిక్వతం, సారివాదివటి, సారివాద్యలేహ్యం, సారివద్యవసం, పిండతైలం, విదార్యాదిలేహ్యం, ద్రాక్షాదికషాయం, జాల్యాది ఘృతం వంటి ఆయుర్వేద ఔషధాల్లో వాడతారు. మొక్క ఆకులు, కాండం, పువ్వులు, కాయలు, వేర్లు అన్నీ వైద్యానికి ఉపకరిస్తాయి.
వేరు రసం కడుపులోనికి తీసుకుంటే టాన్సిల్స్ పోతాయి. వేరు కషాయం పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే విరోచనాలు, దగ్గు తగ్గుతాయి. కషాయం ఎలక్ట్రాల్ పౌడర్ లా ఉపయోగపడుతుంది. వేరు పొడిని ప్రత్యేకంగా ఆవుపాలతో కలిపి తీసుకుంటే రక్తశుద్ధి అవుతుంది. వేర్లను తేనెతో కలిపి తీసుకుంటే కీళ్ళనొప్పులు, సెగ్గడ్డలు, నిస్సత్తువ తగ్గుతాయి.